Begin typing your search above and press return to search.

భూమా వార‌సుడు బ‌య‌ట‌కొచ్చాడుగా!

By:  Tupaki Desk   |   4 May 2017 7:56 AM GMT
భూమా వార‌సుడు బ‌య‌ట‌కొచ్చాడుగా!
X
క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాలు టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడుకు అంత త్వ‌ర‌గా రిలాక్స్ ఇచ్చేలా క‌నిపించ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. పార్టీ సీనియ‌ర్ నేత‌ - నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో అక్క‌డ నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాలు చంద్ర‌బాబుకు కంటి మీద కునుకు లేకుండానే చేస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో భూమా నాగిరెడ్డి వైసీపీ టికెట్‌ పై పోటీ చేయ‌గా, టీడీపీ టికెట్ మీద బ‌రిలో నిలిచిన మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డి ఓట‌మి చ‌వి చూశారు. తాజాగా భూమా మ‌ర‌ణించిన నేప‌థ్యంలో నంద్యాల బై ఎల‌క్ష‌న్స్‌లో తానే నిల‌బ‌డ‌గాన‌ని శిల్పా చెబుతున్నారు.

ఒక‌వేళ పార్టీ టికెట్ నిరాక‌రిస్తే... ఇత‌ర పార్టీల్లోకి వెళ్ల‌డ‌మో, లేదంటే ఇండిపెండెంట్‌ గా పోటీ చేయ‌డ‌మో చేస్తాన‌ని కూడా శిల్పా బ‌హిరంగంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌ద‌నంత‌ర రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో భూమా వైసీపీ హ్యాండిచ్చి టీడీపీలో చేరిపోయారు. ఈ క్ర‌మంలో త‌న తండ్రి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి త‌న కుటుంబానికి చెందిన వారే బ‌రిలోకి దిగుతార‌ని కొత్త‌గా మంత్రి బాధ్య‌త‌లు స్వీక‌రించిన భూమా కూతురు భూమా అఖిల‌ప్రియ కూడా బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు.

ఈ నేప‌థ్యంలో నంద్యాల‌లో భూమా - శిల్పా వ‌ర్గాల మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధానికే తెర లేచింద‌న్న వాద‌న కాద‌న‌లేనిదే. అయితే ఇరువ‌ర్గాల‌తో చంద్ర‌బాబు విడ‌త‌ల‌వారీగా చ‌ర్చ‌లు జ‌రిపి... భూమా - శిల్పాల బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌ల‌కు చెక్ చెప్పారు. ఇదంతా ఒక ఎత్తు అయితే... నిన్న‌టిదాకా తెర వెనుకే ఉన్న భూమా నాగిరెడ్డి సోద‌రుడు భూమా శేఖ‌ర్ రెడ్డి కుమారుడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి రంగంలోకి దిగిపోయారు. నిన్న నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని జిల్లెల్ల పంచాయ‌తీలో ప‌ర్య‌టించిన ఆయ‌న‌... భూమా వ‌ర్గంతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. తన పిన‌తండ్రిని, త‌మ కుటుంబాన్ని న‌మ్ముకున్న ఏ ఒక్క‌రికి అన్యాయం జ‌రిగినా స‌హించేది లేద‌ని చెప్పిన బ్ర‌హ్మానంద‌రెడ్డి... కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు.

అంతేకాకుండా త‌న చిన్నాన్న హ‌యాంలో మంజూరైన ప‌నుల‌కు సంబంధించిన నిధులేమైనా పెండింగ్‌లో ఉన్నాయా?, ప‌నులేమైనా ఆగాయా? అన్న కోణంలోనూ ఆయ‌న ఆరా తీశారు. దీనిని బ‌ట్టి చూస్తుంటే... నంద్యాల అసెంబ్లీకి జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డం ఖాయ‌మేన‌ని బ్ర‌హ్మానంద‌రెడ్డి చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టైంద‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాకుండా మంత్రిగా ఉన్న త‌న సోద‌రి అఖిల‌ప్రియ సూచ‌న‌ల‌తోనే ఆయ‌న నిన్న తెర ముందుకు వ‌చ్చిన‌ట్లు కూడా స్థానికులు చెప్పుకుంటున్నారు. ఇదే నిజ‌మైతే.. అటు శిల్పా మోహ‌న్ రెడ్డికి షాక్ కొట్ట‌డంతో పాటు పంచాయ‌తీని సామ‌ర‌స్యంగా ప‌రిష్క్రరించాన‌ని సంతోషంగా ఉన్న చంద్ర‌బాబుకు కూడా భారీ ఎదురు దెబ్బేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/