Begin typing your search above and press return to search.

భూమా ఫ్యామిలీకి నంద్యాల సీటు

By:  Tupaki Desk   |   18 Jun 2017 5:00 AM GMT
భూమా ఫ్యామిలీకి నంద్యాల సీటు
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపించిన నంద్యాల ఉప ఎన్నిక అభ్య‌ర్థిపై ఆయ‌న కీల‌క‌నిర్ణ‌యం తీసుకున్నారు. నంద్యాల ఉప ఎన్నిక కోసం బాబు నిర్ణ‌యానికి ముందు.. నంద్యాల ప‌రిధిలో కీల‌క‌మైన శిల్పా మోహ‌న్ రెడ్డిని బాబు కోల్పోవాల్సి వ‌చ్చింది. ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా భూమా కుటుంబ స‌భ్యుడ్నే బ‌రిలోకి దించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

భూమానాగిరెడ్డి అన్న కొడుకు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. శిల్పా మోహ‌న్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవ‌టంతో ఆయ‌నీ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. నంద్యాల అభ్య‌ర్థిత్వంతో పార్టీ నేత‌లంతా భూమా ఫ్యామిలీకి ఇవ్వ‌టాన్ని స‌మ‌ర్థించ‌టంతో.. ఈ వ్య‌వ‌హారం పెద్ద‌గా చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. ఇదిలా ఉంటే..క‌ర్నూలు జిల్లా టీడీపీ అధ్య‌క్షుడిగా తొలుత అనుకున్న‌ట్లు శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డికి ద‌క్కలేదు.

శిల్పా చ‌క్ర‌పాణి సోద‌రుడు పార్టీ మారిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి ద‌క్క‌లేదు. ఆయ‌న స్థానంలో సీనియ‌ర్ నేత‌.. విప‌క్షంలో ఉన్న‌ప్పుడు సైతం జిల్లా అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించిన సోమిశెట్టి వెంక‌టేశ్వ‌ర్లును తిరిగి నియ‌మిస్తున్న‌ట్లు చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు.. భూమా నాగిరెడ్డి కుమార్తె క‌మ్ మంత్రి అఖిల ప్రియ‌కు.. భూమాకు రైట్ హ్యాండ్ లా ఉండే ఏవీ సుబ్బారెడ్డికి మ‌ధ్య వ‌చ్చిన మ‌న‌స్ప‌ర్థ‌ల్ని స‌ర్దిపుచ్చే ప్ర‌య‌త్నం చేశారు చంద్ర‌బాబు.

ఇరువురిని ప్ర‌త్యేకంగా కూర్చోబెట్టి మాట్లాడిన చంద్ర‌బాబు.. క‌లిసి ప‌ని చేయాల‌ని కోరారు. ఏదైనా విబేధాలు ఉంటే.. త‌న వ‌ద్ద‌కు రావాల‌ని చెప్పారు. ఇందుకు ఇద్ద‌రు సుముఖత‌ను వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. క‌ర్నూలు జిల్లాలోని ఓర్వ‌క‌ల్లులో విమానాశ్ర‌యాన్ని త్వ‌ర‌గా పూర్తి చేస్తామ‌ని జిల్లా నేత‌ల‌కు చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ఈ నెల 21న తాను నంద్యాల వ‌స్తున్న‌ట్లుగా చెప్పిన చంద్ర‌బాబు.. కొత్త ఇళ్ల శంకుస్థాప‌న చేస్తాన‌ని చెప్పారు. ఇఫ్తార్ విందుకు హాజ‌రు కానున్న‌ట్లుగా వెల్ల‌డించారు. నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో భూమా నాగిరెడ్డి స్వ‌ప్న‌మైన కొత్త ఇళ్ల కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాల‌ని బాబు భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ ఎప్పుడైనా వెలువ‌డే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలోనే.. కొత్త ఇళ్ల కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/