Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రి పెళ్లి.. లారీనిండా శుభలేఖలు

By:  Tupaki Desk   |   23 Aug 2018 4:40 PM IST
ఏపీ మంత్రి పెళ్లి.. లారీనిండా శుభలేఖలు
X
ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లి కూతురు కాబోతోంది. తర్వలోనే ఆమె వివాహం చేసుకోబోతున్నారు. మంత్రిగా ఉండి పెళ్లి చేసుకోబోతున్న అఖిలప్రియ తన హోదాకు తగ్గట్టు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. అఖిల ప్రియ పెళ్లి ఏర్పాట్లపై తాజాగా ఓ జాతీయ పత్రికలో వచ్చిన కథనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అఖిలప్రియ అతిథులను ఆహ్వానించేందుకు గాను ఓ లారీ లోడ్ శుభలేఖలు తయారు చేయించారని కథనం ప్రచురించింది. వీటన్నింటిలోని నంద్యాల - ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అభిమానులు, పార్టీ కార్యకర్తలకు పంచేందుకు నిర్ణయించిందట.. దాదాపు 30వేల కార్డులను ఇందుకోసం ముద్రించినట్టు కథనం సారాంశం..

మునిసిపల్ మంత్రి పి.నారాయణకు సమీప బంధువైన భార్గవ్ తో అఖిలప్రియ వివాహం కర్నూలులోని శోభా నాగిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఈనెల 29న జరగనుంది. గవర్నర్ నరసింహాన్ - సీఎం చంద్రబాబు - మంత్రి లోకేష్ తో సహా పలువురు ప్రముఖులు - తెలంగాణ మంత్రులు కూడా ఈ వేడుకలో పాలుపంచుకోనున్నారు.

వచ్చే ఏడాదే ఎన్నికలు ఉండడంతో దాన్ని క్యాష్ చేసుకోవడానికి అఖిలప్రియ తన ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహించే రెండు నియోజకవర్గాల్లో తమ వర్గాన్ని మొత్తం పెళ్లికి పిలిచి పార్టీ ఇవ్వాలని డిసైడ్ అయ్యిందట.. తద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని యోచిస్తోంది.