Begin typing your search above and press return to search.
భార్యని ఉతికారేసిన పోలీస్ ఉన్నతాధికారి .. ఎందుకంటే ?
By: Tupaki Desk | 28 Sept 2020 11:00 PM ISTమధ్యప్రదేశ్ లోని భోపాల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడి పోలీసు విభాగంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) గా పనిచేస్తున్న పురుషోత్తం శర్మ తన భార్యను ఇంట్లో కింద పడేసి ఆమె మీద కూర్చుని ఆమెను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. అయన తన భార్యను కొట్టే దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మధ్యప్రదేశ్ కు చెందిన డీజీ స్థాయి అధికారి పురుషోత్తం శర్మ మరో మహిళతో ఇంట్లో చూడకూడని భంగిమలో ఉన్నప్పుడు భార్య చూశారు. దీంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన పురుషోత్తం భార్యపై తీవ్రంగా దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో పురుషోత్తం కుమారుడు పార్థ్ గౌతమ్ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై హోంమంత్రి, ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రిపై కేసు నమోదు చేయాలని కోరారు.
కాగా ఆ సంఘటనపై శర్మను మీడియా వివరణ కోరగా.. 32 ఏళ్ల నుంచి తాము కలసి జీవిస్తున్నామని, 2008లో ఆమె తనపై కంప్లెయింట్ ఇచ్చిందని అన్నాడు. అయినపప్పటికీ అప్పటి నుంచి ఆమె తన ఇంట్లోనే నివసిస్తుందని, అన్ని రకాల వసతులను పొందుతుందని, విదేశాలకు కూడా తన డబ్బుతోనే వెళ్తుందని, అలాంటప్పుడు ఆమెపై తనకు అన్ని అధికారాలు ఉంటాయని, ఆమె తన ప్రాపర్టీ అని, ఆమెను హింసించడం కరెక్టేనని అతను తనను తాను సమర్థించుకున్నాడు. అంతే కాకుండా ఇంట్లో సీసీ టీవీలతో భార్య తనపై నిఘా పెట్టిందనీ, తాను రక్షించుకునే క్రమంలో దురదృష్టవశాత్తూ ఈ సంఘటన చోటు చేసుకుందని వాపోయారు.

Purshottam Sharma, Special DG, MP brutally assaults his wife