Begin typing your search above and press return to search.

భీమవరం పీఎం టూర్ : రఘురామ మీద ఇంత కోపమా...?

By:  Tupaki Desk   |   23 Jun 2022 10:30 AM GMT
భీమవరం పీఎం టూర్ : రఘురామ మీద ఇంత కోపమా...?
X
వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా నెగ్గి స్వల్ప వ్యవధిలోనే జగన్ మీద ఘాటు విమర్శలు చేస్తూ పార్టీలో రెబెల్ గా మారిన రఘురామ క్రిష్ణం రాజు చాలా కాలానికి తన సొంత నియోజకవర్గం నర్సాపురంలో అడుగుపెట్టబోతున్నారు. జూలై 4న అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలను ప్రధాని నరేంద్ర మోడీ భీమవరంలో ప్రారంభించనున్నారు. దాంతో లోకల్ ఎంపీగా రాఘురామ కూడా అదే వేదిక మీద మెరియనున్నారు.

ఇక ఏపీ సీఎం హోదాలో జగన్ కూడా అదే వేదిక మీద ఉంటే ఆ రేర్ పొలిటికల్ పిక్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు టోటల్ ప్రొగ్రాం మారిపోతోంది. జగన్ ఈ నెల 28న పారిస్ టూర్ పెట్టుకున్నారు. తన పెద్ద కుమార్తె చదువుతున్న కాలేజీలో స్నాతకోత్సవ వేడుకలకు జగన్ హాజరు కానున్నారు. ఆయన పారిస్ నుంచి తిరిగి జాలై 5నకు రానున్నారు.

అంటే నాలుగున జరిగే ప్రధాని టూర్ లో జగన్ ఎక్కడా కనిపించరు అన్న మాట. అఫీషియల్ గా జగన్ పారిస్ టూర్ మీద ప్రకటన వెలువడిన తరువాత ఇక జగన్ రఘురామతో కలసి భీమవరంలో ప్రధాని సభను పంచుకునే వీలు ఉండదని అంటున్నారు.

అయితే ఇలా ఎందుకు జరిగింది. ఇది ఏమైనా అనుకోని చేశారా అంటే దాని మీద కూడా రకరకాలైన ప్రచారం సాగుతోంది.

రఘురామ రాజు తనను ఎదిరించి విపక్షం కంటే దారుణంగా మట్లాడారు అన్న కోపం అయితే జగన్ నిండుగా ఉంది అంటున్నారు. అందుకే రఘురామ ముఖం చూడడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు అని అంటున్నారు. ఇక జూలై 2న స్నాతకోత్సవం ఉందని, ఆయన అనుకుంటే 4 నాటికి రాగలరు అని కూడా అంటున్నారు.

అంటే కేవలం రఘురామ మీద కోపంతో జగన్ భీమవరంలో ప్రధాని టూర్ ని కూడా కాదనుకుంటున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. మొత్తానికి రఘురామ జగన్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారనుకుని అంతా అనుకుంటే ఆ రాజకీయ ముచ్చట మాత్రం భీమవరం సభ తీర్చే అవకాశం లేదు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.