Begin typing your search above and press return to search.

ర‌జ‌నీపై భార‌తీరాజా షాకింగ్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   31 May 2017 8:36 AM GMT
ర‌జ‌నీపై భార‌తీరాజా షాకింగ్ కామెంట్స్‌
X
త‌మిళ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌నుకుంటున్న త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు భార‌తీరాజా. మేధావిగా.. విభిన్న‌మైన చిత్రాల్ని తీసే ద‌ర్శ‌కుడిగా పేరున్న ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన వ్యాఖ్య‌లు విన్న వారంతా షాక్ తింటున్నారు.

ఊహ‌కు అంద‌ని రీతిలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారుతున్నాయి. ర‌జ‌నీపై భార‌తీరాజా చేసిన వ్యాఖ్య‌ల్ని చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ఖండిస్తున్నారు. భార‌తీరాజా లాంటి వ్య‌క్తి.. ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీ మీద చేసిన వ్యాఖ్య‌లు చూసిన‌ప్పుడు.. ఒక‌వేళ త‌లైవా కానీ పాలిటిక్స్ లోకి వ‌స్తే.. ఆయ‌న‌పై ఎంత‌టి అస‌హ్య‌క‌ర‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఉందో తెలిసేలా తాజా వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఆ మ‌ధ్య‌న వేరే విష‌యానికి నిర్వ‌హించిన నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారిపై గూండాగిరి కేసులు పెట్టిన నేప‌థ్యంలో.. పోలీసుల తీరును ఖండిస్తూ భార‌తీరాజాతో పాటు ప‌లువురు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు మంగ‌ళ‌వారం మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అస‌లు విష‌యం పోయి.. కొస‌రు విష‌యం మిగిలిన‌ట్లుగా మారింది.

పోలీసులు న‌మోదు చేసిన కేసుల మీద మాట్లాడిన స‌మ‌యంలోనే ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీపై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా చేసిన వ్యాఖ్య‌లు దిగ్భాంత్రికి గురయ్యేలా చేశాయి. త‌మిళుల‌కు మంచి నాయకులు లేకుంటే.. వారు వ‌చ్చేస్తారా? ఒక‌వేళ త‌మిళుల‌కు మంచి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలున్న నేత‌లు లేక‌పోతే ఏం చేస్తారు? ఒక‌వేళ నా భార్య కానీ గ‌ర్భ‌వ‌తి కాకుంటే.. నువ్వు వ‌చ్చి పిల్లాడికి తండ్రిని అవుతానంటావా? నువ్వు ఏదైనా అడిగే షేర్ చేసుకోవ‌చ్చు. కానీ.. నా బెడ్ లో షేర్ అడిగితే ఎలా? అంటూ భార‌తీరాజా వ్యాఖ్యానించార‌ని ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ రిపోర్ట్ చేసింది. భార‌తీరాజా నోటి నుంచి వ్యాఖ్య‌ల‌తో మీడియా స‌మావేశంలో పాల్గొన్న సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు.. ఇత‌రులు నోట మాట రాకుండా నిశ్చేష్టులైపోయిన‌ట్లుగా పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/