Begin typing your search above and press return to search.

ఈసారి కూడా రాయబారం భారతిదేనా?

By:  Tupaki Desk   |   26 Sept 2015 3:38 PM IST
ఈసారి కూడా రాయబారం భారతిదేనా?
X
ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావును వైసీపీ అధినేత జగన్ కలుసుకోవడానికి ఎవరు మధ్యవర్తిత్వం వహించారు? ఇద్దరి మధ్య మాటలు కలిపింది ఎవరు? ఈ ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఎదురవుతున్నాయి. ఇందుకు సమాధానం జగన్ భార్య భారతి అని తెలుస్తోంది.

ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా జగన్, రామోజీ మధ్య భారతి రాయబారం నడిపారనే కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత నుంచే ఈనాడు - సాక్షి పత్రికల మధ్య పరస్పర ద్వేషపూర్వకమైన రాతలకు ఫుల్ స్టాప్ పడిందనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత నుంచి సాక్షికి వ్యతిరేకంగా ఈనాడులో కథనాలు రాలేదు. ఈనాడుకు వ్యతిరేకంగా సాక్షిలో వార్తలు రాయలేదు. ఇంకా చెప్పాలంటే, ఆ సమయంలో ఈనాడులో ఉద్యోగులను తొలగించినా.. ఈనాడు ఉద్యోగుల్లో ఒక రకమైన సంక్షోభ పరిస్థితులు ఏర్పడినా వాటిని సాక్షి ఏమాత్రం పట్టించుకోలేదని వివరిస్తున్నారు. తాజాగా, భూమన కరుణాకర రెడ్డి ఇంట్లో శుభ కార్యానికి పిలవడానికి వెళుతుంటే ఆయన వెంట జగన్ వెళ్లారని పైకి చెబుతున్నా.. అప్పటికే రామోజీరావుతో భారతి మాట్లాడారని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గతం గత: అనే కోణంలో భారతి మాట్లాడారని, మీరు అంగీకరిస్తే జగన్ వస్తారని అడిగినట్లు కూడా ఆ వర్గాలు చెబుతున్నాయి. అందుకు రామోజీ అంగీకరించారని, ఆ తర్వాతే జగన్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారని చెబుతున్నాయి.