Begin typing your search above and press return to search.

జగన్ కోసం భారతమ్మ రెడీ... ?

By:  Tupaki Desk   |   18 Nov 2021 2:30 AM GMT
జగన్ కోసం భారతమ్మ రెడీ... ?
X
ఆమె సహధర్మ పత్ని. భర్త అడుగు జాడలలో నడవడమే సతిగా ఆమె ధర్మం. . జగన్ జైలుపాలు అయి ఏకంగా పదహారు నెలల పాటు బెయిల్ రాక ఉంటే ఆనాడు అన్ని రకాలుగా వత్తిడులను తట్టుకుని కష్టాలను ఎదురొడ్డిన మహిళగా ముందు నిలిచింది. ఇక ఏ మగాడి విజయం వెనక అయినా ఆడవారు ఉంటారు అని అంటారు. అలా జగన్ వెనక భారతి ఎపుడూ ఉన్నారని చెబుతారు. వైఎస్సార్ లాంటి రాజకీయ ధురంధరుడి ఇంట కోడలిగా అడుగు పెట్టిన భారతికి రాజకీయాలు వంటబట్టవని ఎవరూ అనుకోరు. అయితే ఆమె ఎపుడూ బయటకు వచ్చి భారీ స్థాయిలో రాజకీయ ప్రసంగాలు చేసినది లేదు.

జగన్ తరఫున ఆమె పులివెందులలో ప్రచారం చేసి ఆయన విజయానికి తన వంతు పాత్ర నిర్వహించారు. అలాంటి భారతి మీద మరింత‌ భారం పడబోతోంది అంటున్నారు.

మరో రెండున్నరేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికల వేళకు వైసీపీ తరఫున ప్రచారం చేయడానికి స్టార్ కాంపెయినర్లు ఎవరూ లేరు. 2012 నుంచి మొదలు పెడితే 2019 దాకా జరిగిన అన్ని ఎన్నికల్లో వైఎస్ విజయమ్మతో పాటు వైఎస్ షర్మిల వైసీపీ విజయానికి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే ఇపుడు షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఆమె అక్కడ బిజీగా ఉంటారు.

దాంతో ఏపీలో ఆమె ప్రచారం చేయరు అన్నది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక విజయమ్మ విషయానికి వస్తే ఆమె ఇదివరకు మాదిరిగా వైసీపీ కార్యక్రమాల్లో పెద్దగా పాలుపంచుకోవడంలేదు. అంతే కాదు 2024 ఎన్నికల్లో ఆమె కనుక ప్రచారం చేస్తే రెండు మూడు మీటింగ్స్ లోనే ఉండవచ్చు అంటున్నారు.

మరి అది వైసీపీకి అసలు సరిపోదు, పైగా జగన్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఆయన డైరెక్ట్ గా జనాల్లోకి వెళ్ళి అడుగు కదిపి ప్రచారం చేయలేరు. ఆయన ఎంత చేసినా అధికార నీడలోనే చేయాలి. దాంతో మరి వైసీపీ తరఫున స్టార్ కాంపెయినర్ ఎవరూ అంటే భారతమ్మ అంటున్నారు.

ఆమెనే ముందు పెట్టి వచ్చే ఎన్నికల్లో ఏపీ అంతా వైసీపీకి విస్తృతంగా ప్రచారం చేయించాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడే అనుభవం అయితే ఆమెకు లేదు అంటారు. పైగా రాజకీయ సభల్లో ప్రసంగాలు అంటే ఆ తీరే వేరుగా ఉండాలి. ఇక వచ్చే ఎన్నికలు అటు టీడీపీతో పాటు విపక్షాలకు కూడా చావో రేవో అన్నట్లుగానే ఉంటాయి. అదే సమయంలో అధికార వైసీపీకి కూడా అత్యంత కీలకం అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.

దాంతో వైఎస్ భారతి మొత్తం వైసీపీ ప్రచార భాధ్యతలు తన భుజాల మీద పెట్టుకుంటారని అంటున్నారు. అందుకోసం ఆమె ఇప్పటి నుంచే ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు అన ప్రచారం అయితే ఉంది. మరి ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా వైసీపీకి మాత్రం జగన్ తరువాత ఇపుడు భారతి మాత్రమే స్టార్ కాంపెయినర్ అన్నది వాస్తవం. అంటే 2024 నాటికి వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి తెర ముందుకు వచ్చి మరీ భారతి జనాలతో డైరెక్ట్ గా కనెక్ట్ అవుతారు అంటున్నారు. మొత్తానికి 2024 నాటికి వైసీపీకి ఆమె కొత్త ముఖంగా అతి పెద్ద ఆకర్షణగా ఉంటారని నమ్ముతున్నారు. చూడాలి మరి వైసీపీ వ్యూహాలు ఏ విధంగా సాగుతాయో.