Begin typing your search above and press return to search.

పీవీకి భారతరత్న ఇవ్వాలి : సీఎం కేసీఆర్

By:  Tupaki Desk   |   8 Sept 2020 4:40 PM IST
పీవీకి భారతరత్న ఇవ్వాలి : సీఎం కేసీఆర్
X
దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు ప్రతి ఒక్క భారతీయుని జీవన శైలి మారడంలో కీలక భూమిక వహించాడు అని భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. గ్లోబల్ ఇండియా రూపశిల్పి పీవీ నరసింహరావు అని చెప్పారు. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితాలను నేడు మనం అనుభవిస్తున్నామని, ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన మొదటి వ్యక్తి నెహ్రూ అయితే.. రెండో వ్యక్తి పీవీ నరసింహారావు అని సీఎం కేసీఆర్ అయన పై ప్రశంసలు కురిపించాలి. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. పీవీ బహుముఖ ప్రజ్ఞశాలి, బహుభాషా కోవిదుడు అన్న సీఎం , ఆయన నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టారని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాక అయిన పీవీ శత జయంతి ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తన సొంత భూమి 800 ఎకరాలను ప్రభుత్వానికి స్వాధీనం చేశారని కొనియాడురు. హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.

భారత్ ఇంత వేగంగా అభివృద్ధి చెందడానికి, ఆర్థిక వ్యవస్థలో పురోగమించడానికి పీవీ కారణమని, పీవీ మన ఠీవీ అని తెలంగాణ సగర్వంగా చెప్పుకుంటున్న సందర్భం ఇది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాజకీయాలతో సంబంధంలోని ఆర్థికవేత్త మన్మోహన్‌ను ఆర్థిక శాఖ మంత్రిగా నియమించి పీవీ తన ప్రత్యేకతను చాటుకున్నారని అన్నారు. సరళీకృత విధానాలతో దేశ ఆర్థిక గమనాన్ని మార్చివేశారని తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి దేశానికి పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణంగా పీవీనే అని అన్నారు. పీవీ నరసింహారావు భూసంస్కరణలను చిత్తశుద్దితో అమలు చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. అలాంటి పీవీకి ఇప్పటికైనా భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయనకు భారతరత్న ఇవ్వడంతో పాటు పార్లమెంట్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.