Begin typing your search above and press return to search.
మూడోదశకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ట్రయల్స్
By: Tupaki Desk | 24 Oct 2020 1:20 PM ISTహైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఫార్మా దిగ్గజం ‘భారత్ బయోటెక్’ తయారు చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కీలక దశకు చేరుకున్నాయి. నవంబర్ లో మూడో దశ ప్రయోగాలు మొదలు కానున్నాయి. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. దేశ ప్రజలందరికీ అందించడానికి భారత్ బయోటెక్ ఈ మేరకు ఏర్పాట్లు మొదలుపెట్టింది.
ఇప్పటికే భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’ క్లినికల్ ట్రయల్స్ మొదటి, రెండో దశ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మూడో దశ ప్రయోగాలకు సిద్ధమైంది. 2021 జూన్ వరకు టీకాను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కంపెనీ డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. అత్యవసర కేసుల్లో బాధితుల కోసం ప్రభుత్వ ఆమోదంతో అంతకంటే ముందే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
తాజాగా భారత్ బయోటెక్ కు మూడోదశ ప్రయోగాలకు ‘డీసీజీఐ’ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్టు భారత్ బయోటెక్ తెలిపింది. తొలి, రెండో దశ ప్రయోగాల్లో జంతువులతోపాటు మనుషులపై కూడా భారత్ బయోటెక్ ప్రయోగాలు జరిపింది. ఆ ఫలితాలను అనుసరించి మూడో దశకు అనుమతులు మంజూరు చేసింది.
ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 25వేలకుపైగా వలంటీర్లతో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి భారత్ బయోటెక్ చేసింది. నవంబర్ మొదటి వారంలో కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ప్రారంభించనుంది. హైదరాబాద్ లోని నిమ్స్ లోనూ ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. 100 మంది వలంటీర్లు ఈ ప్రయోగాల్లో భాగంగా టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు ఎవరికి అనారోగ్య సమస్యలురాలేదని.. వ్యాక్సిన్ బాగా పనిచేస్తోందని భారత్ బయోటెక్ చెబుతోంది. మూడో దశ పూర్తయ్యాక ప్రజలకు అందుబాటులోకి రానుంది.