Begin typing your search above and press return to search.

తమ వ్యాక్సిన్ పై భారత్ బయోటెక్ సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   16 Jan 2021 1:18 PM GMT
తమ వ్యాక్సిన్ పై భారత్ బయోటెక్ సంచలన ప్రకటన
X
కరోనా వ్యాక్సిన్ భారత్ లో వచ్చేసింది. ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించేశారు కూడా.. దేశంలో కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలను మొదట వైద్యులు, వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ కార్మికులకు వేస్తున్నారు.

అయితే ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ పై ఎన్నో అనుమానాలు, సందేహాలు నెలకొన్నాయి.ఈ సందర్భంలో కోవాగ్జిన్ తయారు చేసిన 'భారత్ బయోటెక్' సంచలన ప్రకటన చేసింది.

తాము తయారు చేసిన 'కోవాగ్జిన్' టీకా వేయించుకున్న వ్యక్తుల్లో ఒకవేళ ఎవరికైనా దుష్ప్రభావాలు ఎదురైతే వారికి నష్టపరిహారం చెల్లిస్తామని కంపెనీ తెలిపింది. టీకా కేంద్రాలతో భారత్ బయోటెక్ శుక్రవారం పంచుకున్న సమ్మతి పత్రంపైన ఈ అంశాన్ని భారత్ బయోటెక్ పేర్కొంది. టీకా తీసుకున్న అనంతరం ఏవైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురైతే ప్రభుత్వ, ప్రభుత్వ, అధీకృత కేంద్రాలు, ఆస్పత్రులలో చికిత్స అందజేస్తామని భారత్ బయోటెక్ ప్రకటించింది.

ఈ మేరకు పరిహారం విషయంలో వ్యాక్సిన్ తయారీదారులు, ప్రభుత్వం మధ్య వివాదం నెలకొంది. అన్నింటికీ కంపెనీయే బాధ్యత వహిస్తాయని ప్రభుత్వం టీకా కొనుగోలు ఉత్తర్వుల్లో పేర్కొంది. కోవిషీల్డ్ మాత్రం ఇటువంటి నిరభ్యంతర పత్రాలు ఏమీ అడగలేదు. ఆ కంపెనీ తమ టీకా సేఫ్ అని ముందు నుంచి చెబుతోంది.

వ్యాక్సిన్ పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఇప్పటికే శాస్త్రవేత్తలు తెలిపారు. ముందు జాగ్రత్తగా కేంద్రం సదురు కంపెనీలతో హామీ పత్రంను ప్రభుత్వం రాయించుకుంది.