Begin typing your search above and press return to search.
కోవిడ్ వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్య చేసిన భారత బయోటెక్
By: Tupaki Desk | 30 Sept 2020 1:20 PM ISTఎప్పుడా.. మరెప్పుడా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు భారత బయోటెక్ సీఎండీ క్రిష్ణ ఎల్లా. కరోనాకు చెక్ పెట్టే కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికి.. భారత బయోటెక్ మాత్రం అందుకు భిన్నంగా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇందుకు భిన్నంగా తాజాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సైకు మాత్రం వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చేదన్న విషయాన్ని వెల్లడించటం ఆసక్తికరంగా మారింది.
భారత బయోటెక్ కు హైదరాబాద్ నగర శివారులోని శామీర్ పేట వద్ద ఉన్న జినోమ్ వ్యాలీలో కార్యాలయం ఉంది. అక్కడకు వెళ్లిన గవర్నర్ తమిళ సైతో.. భారత బయోటెక్ సీఎండీ.. జేఎండీ తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ప్రాంగణాన్ని.. ప్రయోగశాలను తమిళ సై చూశారు.
అతి తక్కువ ధరకు.. సురక్షితమైన.. సమర్థవంతమైన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను అందించనున్నట్లు చెబుతున్న సంగతి తెలిసిందే.. అయితే.. ఈ వ్యాక్సిన్ ప్రజలకు ఎందుకు అందుబాటులోకి వస్తుందన్న విషయంపై ఆసక్తికర వ్యాఖ్యల్ని చేసింది భారత్ బయోటెక్. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. టీకా తయారీలో పని చేస్తున్న వారిని ధన్యవాదాలు చెప్పేందుకే తాను వచ్చినట్లుగా గవర్నర్ వెల్లడించారు.
కరోనాకు వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుందన్న తమిళ సై.. ఈ వ్యాక్సిన్ ప్రపంచ ప్రజలందరికి చేరాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. సామాజిక.. ఆర్థిక అంశాల్ని పక్కన పెట్టి అన్ని దేశాలకు అందాలని.. అందరికి ప్రయోజనం చేకూరాలన్నారు. వ్యాక్సిన్ తయారీ కోసం భారత బయోటెక్ సిబ్బంది అహర్నిశలు కష్టపడుతున్నట్లుగా సంస్థ సీఎండీ పేర్కొన్నారు. ఇప్పటివరకు వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చేదెప్పుడు అన్న సందేహానికి తాత్కాలికంగా సమాధానం లభించినట్లేనని చెప్పక తప్పదు.