Begin typing your search above and press return to search.
శుభవార్త చెప్పిన భారత్ బయోటెక్..జంతువులపై వ్యాక్సిన్ ట్రయల్స్ సక్సెస్!
By: Tupaki Desk | 12 Sept 2020 5:20 PM ISTదేశం లో కరోనా వైరస్ తీవ్రత .. రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ప్రతి రోజు కూడా దాదాపుగా లక్షకి దరిదాపుల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు 46 లక్షల కేసులు నమోదు అయ్యాయి. అలాగే ప్రతి రోజు వెయ్యికి పైగా మరణాలు నమోదు అవుతున్నారు. ఇక కరోనా తీవ్రత ఇలా కొనసాగుతుంటే .. మరో పక్క వాటికి సంబందించి వ్యాక్సిన్లు తయారు చేయడం లో పలు కంపెనీలు తలమునకలవుతున్నారు. అయితే ఇవి ఎంత అత్యవసరమైనా వాటి తయారీకి కొన్ని ప్రమాణాలు పాటించాల్సి రావడం తో కొంత సమయం అలస్య మవుతోంది. ఈ క్రమం లో భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాక్జిన్ కు సంబంధించి జంతువులపై చేసిన ట్రయల్స్ సత్ఫలితాలిచ్చినట్టు ప్రకటించింది.
హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్ధ కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్‌ను ఈ ఏడాది మే నెలలో అభివృద్ధి చేసింది. దీన్ని తొలుత జంతువులపై ప్రయోగించింది. ఇందులో తాము విజయవంతం అయినట్లు భారత్ బయోటెక్ సంస్ధ తాజాగా ప్రకటించింది. తాజా ట్రయల్స్‌తో కలిపి భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌పై రెండుసార్లు ట్రయల్స్ నిర్వహించినట్లయింది. ప్రపంచ దేశాలన్ని కరోనా వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అందరి చూపు ఆక్స్‌ఫోర్డ్ ఆస్ట్రాజెనెకా మీదనే ఉండగా, అనుకోని విధంగా ఆ వ్యాక్సిన్ ట్రయల్స్‌కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరింత ఆలస్యమవుతుందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యం లో భారత్ బయోటెక్ శుభవార్త చెప్పింది. తాము అభివృద్ధి చేసిన కోవాక్జిన్ జంతువుల్లో సత్ఫలితాలిచ్చినట్లు వెల్లడించింది.
భారత్ బయోటెక్ జంతువుల పై నిర్వహించిన ట్రయల్స్ ను నాలుగు దశలుగా విభజించారు. ప్రతీ దశలోనూ ఐదేసి కోతుల చొప్పన ఎంపిక చేసి వాటి పై టీకా ప్రయోగించారు. తొలి సారి ఓ డోస్ ఇచ్చిన తర్వాత తిరిగి 14 రోజుల్లో వీటికి మరో డోస్ ఇచ్చారు. వీటికి కోతులు తట్టుకుంటున్నట్లు తేలిందని భారత్ బయోటెక్ తెలిపింది. మూడు వారాల్లో వీటికి రోగ నిరోధక యాండీబాడీలు పెరిగాయని తేల్చారు. ఎలాంటి ఇతర ఇన్పెక్షన్లు కూడా సోక లేదని కూడా తెలిసింది. వ్యాక్సిన్ ఇచ్చిన జంతువుల్లో ఇమ్యూనిటీ పెరిగింది. ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్ వృద్ధిని నియంత్రించినట్టు గుర్తించాము. రెండో డోస్ ఇచ్చిన 14రోజుల తర్వాత మరోసారి జంతువులను పరిశీలిస్తాం' అంటూ భారత్ బయోటెక్ ట్వీట్ చేసింది. ఇక ఇప్పటికే నిమ్స్ లో కోవాక్జిన్ రెండో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.