Begin typing your search above and press return to search.
భారత్ బంద్ కు కాస్త ముందు.. హర్యానా రైతుల సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 8 Dec 2020 10:06 AM ISTగడిచిన పదకొండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ శివారులో జరుగుతున్న రైతుల ఆందోళ దేశాన్ని కదిలిస్తోంది. తాజాగా ఈ నిరసన వివిధ దేశాలకు పాకటమే కాదు.. అక్కడి భారతీయులు సైతం రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. తమ సమస్యల పరిష్కారం కోసం..కేంద్రం ఇటీవల తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని వెంటనే రద్దు చేయాలన్న డిమాండ్ తో భారీ ఎత్తున నిరసనలు నిర్వహిస్తున్నారు.
వణికించే చలిలోనూ వెనక్కి తగ్గక.. కేంద్రం తీరును వారు తప్పు పడుతున్నారు. ఇంటికి వెళ్లకుండా రోడ్ల మీదనే పదకొండు రోజులుగా ఉంటున్న వైనం కేంద్రంపైన తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తుంది. ఇలాంటివేళలో.. విపక్షాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇదిలా ఉంటే.. ఓవైపు పంజాబ్ రైతులు నిరసనలు చేస్తుంటే.. పక్కనే ఉన్న హర్యానా రాష్ట్ర రైతులు మాత్రం కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోవద్దంటూ కోరటం ఆసక్తికరంగా మారింది. హర్యానాకు చెందిన 50 వేల మందితో కూడిన రైతులు కేంద్రం చట్టాల్ని కొనసాగించాలని కోరటం గమనార్హం.
ఓపక్క దేశ వ్యాప్తంగా కేంద్రం తెచ్చిన చట్టాల్ని రద్దు చేయాలని ఆందోళన చేస్తుంటే.. కొత్తగా తెచ్చిన చట్టాల్ని కొనసాగించాలని హర్యానా రైతులు కోరుకోవటం చూస్తే.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతులు ఒకలా.. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మరోలాంటి పరిస్థితి ఉండటం కొత్త సందేహాలకు తెర తీసేలా ఉందని చెప్పాలి. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. దాని పక్కనే ఉండే హర్యానా రైతులు మరోలా స్పందిస్తున్న వైనం షాకింగ్ గా మారిందని చెప్పాలి. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. మేలు జరుగుతుందని హర్యానా రైతులు పేర్కొనటం ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆసక్తికర అంశంగా చెప్పాలి.