Begin typing your search above and press return to search.

హస్సేన్ సాగర్ వద్దనటానికి కేసీఆర్ ఎవరు?

By:  Tupaki Desk   |   18 July 2016 4:47 PM GMT
హస్సేన్ సాగర్ వద్దనటానికి కేసీఆర్ ఎవరు?
X
మరికొద్ది రోజుల్లో మరో వినాయకచవితి ఉత్సవానికి తెర లేవనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేని విధంగా హైదరాబాద్ లో భారీ ఎత్తున వినాయక చవితిని నిర్వహించటం తెలిసిందే. పెద్ద ఎత్తున వినాయచవితి సందర్భంగా పెద్ద ఎత్తున పందిళ్లు ఏర్పాటు చేయటం.. అనంతరం భారీగా హుస్సేన్ సాగర్ లో విగ్రహాల్ని నిమజ్జనం చేయటం సంప్రదాయంగా వస్తోంది. ఇదిలా ఉంటే.. హుస్సేన్ సాగర్ లో నిమజ్జన భారాన్ని తగ్గించేందుకు వీలుగా.. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి చెందిన చెరువుల్లో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈఏడాది నుంచి హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనం ఉండబోదని.. శివారు ప్రాంతాల్లోని చెరువుల్లోనే నిమజ్జనం ఉంటుందంటూ హైకోర్టుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు చెప్పటంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. అన్ని సంప్రదాయాల్ని భారీగా పాటించే కేసీఆర్ గణేశ్ నిమజ్జనం విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఘాటుగా స్పందించింది. శివారు ప్రాంతంలోని చెరువుల్లో నిమజ్జనం ఉంటుందని హైకోర్టుకు ఎలా హామీ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయక నిమజ్జనం సందర్భంగా హుస్సేన్ సాగర్ ను వినియోగిస్తామని.. హైకోర్టు తీర్పు కాపీ తమ వద్దన ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్ సర్కారు తీరు.. కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీసేలా వ్యవహరిస్తోందన్న మాట వినిపిస్తోంది. మిగిలిన అంశాల విషయంలో విపరీతమైన భక్తి ప్రపత్తుల్ని ప్రదర్శించే కేసీఆర్.. హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాన్ని మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు చెప్మా..?