Begin typing your search above and press return to search.

రాములోరి ఆభరణాలు మిస్సింగ్ కన్ఫర్మ్

By:  Tupaki Desk   |   25 Aug 2016 4:51 AM GMT
రాములోరి ఆభరణాలు మిస్సింగ్ కన్ఫర్మ్
X
ప్రసిద్ధ భద్రాద్రిలో రాములోరి ఆభరణాలు మిస్ అయిన విషయంపై స్పష్టత వచ్చేసింది. సీతమ్మ పుస్తెలకు సంబంధించి ఇప్పటివరకూ ఉన్న ఒక్క ఆశ కూడా ఆవిరైనట్లుగా చెబుతున్నారు. అమ్మవారి పుస్తెల్ని ఎవరైనా తీసుకొని.. ఆ తర్వాత హుండీల్లో వేసి ఉంటారేమోనన్న ఆశ కూడా ఆడియాశ అయ్యింది. రాములోరి గుడిలో మిస్ అయిన రెండు ఆభరణాలకు సంబంధించి తాజాగా భారీ కార్యక్రమాన్ని చేపట్టారు.

తొలుత ఆభరణాల మిస్సింగ్ గురించి సమాచారం బయటకు పొక్కి.. అది నిజమేనా? అన్న సందేహాన్ని తీర్చుకునేందుకు ఆలయంలో ఉన్న మొత్తం ఆభరణాల లెక్కల్ని ఈ మధ్యన తీసి వివరంగా లెక్కేశారు. ఈ లెక్కల క్రతువు పూర్తి అయ్యాక రెండు ఆభరణాలు మిస్ అయిన విషయాన్ని తేల్చారు. ఈ నేపథ్యంలో ఎవరైనా ఆర్చకులు ఆభరణాల్ని సేకరించినా.. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో రాములోరి గుడిలో ఉన్న భారీ హుండీల్లో గుట్టుగా వేసి ఉంటారన్న అంచనాలు వ్యక్తమయ్యయి. ఇందులో భాగంగా హుండీల్ని జల్లెడ వేయాలని నిర్ణయించారు.

ఇందుకోసం ఆలయంలోని అన్ని హుండీల్ని తెరిచి చూశారు. ఇనుప జల్లెడ కింద బక్కెట్లు పెట్టి మరీ వెతికారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు. మిస్ అయిన రెండు ఆభరణాల ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణ ఇక షురూ కానుంది. ఇదే సమయంలో నిత్యపూజల కోసం ఆర్చక స్వాములకు అందుబాటులో ఉంచిన ఆభరణాల్ని తాజాగా బ్యాంకు లాకర్ లోకి పెట్టేశారు. ప్రస్తుతం మిస్ అయిన ఆభరణాల ఆచూకీ తేల్చేందుకు పోలీస్ మార్క్ విచారణ తప్పదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదంతం రాములోరి ఆర్చకస్వాముల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.