Begin typing your search above and press return to search.
జాగ్రత్త.. విశాఖలో భూమి కొంటున్నారా?
By: Tupaki Desk | 25 Sept 2020 6:00 AM ISTరేటు తక్కువనో.. లేక ఖరీదైన ఏరియాలో చీప్ గా దొరుకుతుందనో.. విశాఖలో భూమి కావాలని ఎంతైనా పెట్టడానికి రెడీ అయ్యారో మీరు నిండా మునిగినట్టే.. డబ్బులతోపాటు భూమి కూడా మీ సొంతం కాదు..
ఇప్పుడు ఏపీలో అన్ని చోట్ల కంటే విశాఖలో భూముల రేట్లు హాట్ కేకులయ్యాయి. విశాఖను సీఎం జగన్ పరిపాలన రాజధానిగా చేయడంతో అక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఏపీలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా విశాఖ ఉంది. విశాఖకు తీరం ఉండడం ఎక్కువమంది ఇక్కడ ఇళ్లు , ఫ్లాటు, స్థలం ఉండాలని ఆరాటపడుతున్నారు. ఏపీకి రాజధానిగా ప్రకటించడంతో ఇప్పుడు ధరలు ఆకాశాన్నంటాయి.
ప్రస్తుతం భూముల వివాదం పెద్ద ఎత్తున నెలకొంది. ప్రభుత్వ భూములకు సంబంధించిన 22 ఏ భూవివాదం నడుస్తోంది. ఈ 22ఏ భూములు కొంటే మునిగినట్టే. ఎందుకంటే అవి ప్రభుత్వ భూములు. క్రయవిక్రయాలపై నిషేధం ఉంది. కానీ కొందరు అక్రమార్కులు వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదో పెద్ద వ్యాపారంగా విశాఖలో మారింది. తప్పుడు సర్వే నంబర్లు, డాక్యమెంట్లు సృష్టించి కొనుగోలుదారులను నిలువునా ముంచుతున్నారు.
కలెక్టర్ నోటి ఫై చేసిన భూములు నిషేధిత జాబితాలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ సాధ్యం కాదు. కానీ రియల్ ఎస్టేట్ మాయాజాలంతో కొందరు ఈ భూములకు ఎసరు పెడుతున్నారు. ప్రధానంగా దేవాదాయశాఖకు చెందిన ఆస్తులు కూడా చేతులు మారుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ భూముల కుంభకోనంలో ప్రధానంగా ఆనందపురం, పెందుర్తి, భీమిలి మండలాల భూములున్నాయి. వీటి విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా..వీటి మీదనే భూవివాదాలు ఎక్కువ వచ్చాయి. కొందరు తహసీల్దార్లు అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.
ఇప్పుడు ఈ ఆక్రమణలోకి భూ కబ్జాల్లోకి పోయిన 22 పరిధిలోని భూముల స్వాధీనానికి అధికారులు స్పెషల్ డ్రైవ్ పెట్టారు. కొన్నా అమ్మినా చర్యలు తప్పువని హెచ్చరిస్తున్నారు. అయితే భూములు తెలియక కొని మోసపోయిన వారి పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. వారంతా ప్రభుత్వం నిర్ణయంతో నిండా మునిగారు. అమ్మిన వారు మాత్రం లాభపడ్డారు.