Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రి కుమారుడికి బెంజ్ కారు లంచం

By:  Tupaki Desk   |   18 Sept 2020 4:20 PM IST
ఏపీ మంత్రి కుమారుడికి బెంజ్ కారు లంచం
X
ఏపీలో మరో రాజకీయ వేడి రాజుకుంది. అధికార పార్టీ వైసీపీ మంత్రి పై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. ఈఎస్ఐ స్కాంలో మంత్రి, ఆయన కుమారుడు పాత్ర ఉందని అయ్యన్న సంచలన ఆరోపణలు చేశారు.

ఏపీ కార్మికశాఖ మంత్రి కోమటి జయరాం పై మాజీ మంత్రి అయ్యన్న ఘాటు విమర్శలు చేశారు.ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు ప్రమేయం లేదని ఏసీబీ తేల్చిందని.. ఈ స్కాంకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు.

మంత్రి జయరాం కొడుకు ఈశ్వర్‌కు, ఇప్పటికే ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన ఏ-14 కార్తీక్ గిఫ్ట్ ఇచ్చాడని అయ్యన్న ఆరోపించాడు. ఖరీదైన కారును మంత్రి కుమారుడికి పుట్టినరోజున సందర్భంగా అందజేశాడన్నారు.. కారుకు ఫైనాన్స్ చేయించి మరీ కార్తీక్‌ ఇచ్చారన్నారు. ఏ సంబంధంతో కారును కానుకగా ఇచ్చారో మంత్రి సమాధానం ఇవ్వాలి’ అంటూ అయ్యన్న ప్రశ్నించాడు.

‘ఏ 14 అయిన కార్తీక్‌.. మంత్రి జయరాంకు బినామీ. అది పుట్టినరోజు కానుక కాదు.. మంత్రికి ఇచ్చిన లంచం. కార్మిక శాఖలో అవినీతికి పాల్పడింది అచ్చెన్నాయడు కాదు.. మంత్రి జయరాం. నేనే ఆధారాలతో చూపిస్తున్నా.. నిరూపిస్తా కూడా. దీనిపై విచారణ జరిపించాలి. న్యాయస్థానంతో విచారణ చేయించాలి. ముఖ్యమంత్రికి కార్మికశాఖ మంత్రి కోమటి జయరాంపై దర్యాప్తు చేసే దమ్ము ఉందా..? మేము ప్రశ్నిస్తే మమ్మల్ని ముఖ్యమంత్రి బూతులు తిట్టిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ముఖ్యమంత్రి నోరు మెదపరు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి జయరాంతో రాజీనామా చేయించాలి. మంత్రి మండలి నుంచి జయరాంను తప్పించాల్సిందే. బీసీ నేతలను టచ్ చేస్తే ఊరుకోం. మా ఆగ్రహానికి ముఖ్యమంత్రి సమాధి అయిపోతారు. నా ఆరోపణలపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూస్తాను. మాకు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు అంటే ఇష్టం’ అని అయ్యన్న సంచలన ఆరోపణలు చేశారు.

బెజవాడ ఆలయం వెండి రథంలోని మూడు సింహాల విగ్రహాలు లాకర్‌‌లోనో, స్టోర్ రూంలోనో కాకుండా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంట్లో తనిఖీలు చేయాలంటూ అంటూ గురువారం అయ్యన్న ఘాటుగా ట్వీట్‌ చేశారు. శుక్రవారం ప్రెస్‌మీట్‌ పెట్టిన ఆయన కార్మిక శాఖ మంత్రితోపాటే.. జగన్‌ సర్కార్‌‌పై విరుచుకుపడ్డారు.