Begin typing your search above and press return to search.
సెకండ్ ప్లేస్ లో హైదరాబాద్.. అంత ప్రేమ ఎందుకంటే?
By: Tupaki Desk | 10 April 2020 9:15 AM ISTమరోసారి హైదరాబాద్ గొప్పతనం ఏమిటో దేశానికి తెలిసేలా చేసిందో సర్వే ఫలితం. భారతదేశంలో ఐటీ ఉద్యోగం చేయాలంటే అనువైన మహానగరం ఏమిటన్న ప్రశ్నకు హైదరాబాద్ ది బెస్ట్ సిటీగా సెకండ్ ప్లేస్ లో నిలవటం ఆసక్తికరంగా మారింది. కరోనా వేళ.. ఇలాంటి సర్వేలు కూడా నిర్వహిస్తారా? అంటే అవునని చెబుతోంది టెక్ గిగ్ సంస్థ. ఈ సంస్థ ఐటీ రంగంలో జాబ్ కు అనువైన మహానగరం ఏమిటన్న దానిపై సర్వే నిర్వహించింది. ఇందులో గార్డెన్ సిటీ బెంగళూరును తమ ఫస్ట్ ఛాయిస్ గా చెబితే.. హైదరాబాద్ సెకండ్ ఛాయిస్ గా చెప్పేశారు.
మరి.. భాగ్యనగరి రోడ్ల మీద ఉంటే విపరీతమైన ట్రాఫిక్ జాములు.. మౌలిక సదుపాయాలు పెద్దగా ఉండనప్పటికి హైదరాబాద్ రెండో స్థానంలో నిలవటానికి పలు అంశాలు కారణాలుగా చెబుతున్నారు. అత్యుత్తమ జీవన ప్రమాణాలు.. వృత్తిలో ఎదగటానికి అవకాశాలున్న నగరంలో బెంగళూరు బెస్ట్ అంటూ 40 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేయగా.. తర్వాతి ప్లేస్ హైదరాబాద్ నిలిచింది.
ఈ సర్వేలో ఐటీ రంగంలో కనీసం రెండేళ్లుగా పని చేస్తున్న వారు.. 25 నుంచి 35 ఏళ్ల మధ్యనున్న ఐటీ నిపుణులు పాల్గొన్నారు. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 13 శాతం మంది హైదరాబాద్ నగరాన్ని తమ ఛాయిస్ గా ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాతి స్థానంలో ఫూణె నిలిచింది. ఈ సర్వేలో చివరిస్థానంలో నిలిచిన నగరంగా ఢిల్లీ ఎన్ సీఆర్ కావటం గమనార్హం.
ఇంతకీ బెంగళూరు మొదటిస్థానంలో నిలవటానికి కారణం ఏమిటన్న విషయంలోకి వెళితే.. వేతనాల్లో పెరుగుదల.. ఉద్యోగ అవకావఆలు.. జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండటంగా అభిప్రాయపడ్డారు. బెంగళూరులో పని చేస్తున్న వారిలో చాలామంది వేరే నగరానికి మారటానికి ఆసక్తిని చూపించకపోవటం గమనార్హం. అదే సమయంలో తమ ఇష్టంతోనే ఆ నగరంలో పని చేస్తున్నట్లు చెప్పారు. వాతావరణంతో పాటు.. మిగిలిన అంశాలతో చూసినప్పుడు బెంగళూరు తర్వాతి స్థానంలో హైదరాబాద్ నగరం నిలిచింది. తాజా సర్వేతో ఐటీ రంగంలో హైదరాబాద్ స్థానం ఎంతన్న విషయం స్పష్టమైందని చెప్పక తప్పదు.