Begin typing your search above and press return to search.

మరోసారి నెంబర్. 1ప్లేస్ బెంగుళూరుదే

By:  Tupaki Desk   |   28 Jun 2021 4:00 PM IST
మరోసారి నెంబర్. 1ప్లేస్ బెంగుళూరుదే
X
ఇండియా ఫారెన్ , ఐటీ హబ్ , కర్ణాటక రాజధాని .. కొలువుల నగరమైన బెంగుళూరు మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. మనదేశంలోని నివాసయోగ్య నగరాల్లో కర్ణాటక రాజధాని బెంగుళూరు తోలి స్థానంలో నిలిచింది. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌– 2020 ప్రకారం భారతదేశంలో అత్యంత నివాసయోగ్య నగరంగా బెంగళూరు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆహ్లాదరకరమైన వాతావరణం, పచ్చని చెట్లు, విస్తరిస్తున్న ఐటీ రంగం తదితరాలతో ఈ హోదాను సొంతం చేసుకుంది. నగరాల్లో జీవనం సాగించేందుకు అనుకూల పరిస్థితులకు అనుగుణంగా ఈ ర్యాంకుల్ని కేటాయిస్తుంటారు.

విజ్ఞాన, పర్యావరణ కేంద్రం (సీఎస్‌ ఈ) విడుదల చేసిన నివాసయోగ్యాల నగరాల జాబితాలో బెంగళూరు తర్వాత స్థానాల్లో చెన్నై, సిమ్లా, భువనేశ్వర్, ముంబై నిలిచాయి. ఢిల్లీ ఆరోస్థానంలో నిలిచింది. అలాగే, ఆర్థిక సామర్థ్యంలోనూ చాలా వెనుకబడి ఉంది. మొత్తం ఐదు విభాగాల్లో సీఎస్‌ ఈ అధ్యయనం జరిపి ర్యాంకింగులను ప్రకటించింది. ఇక నాణ్యమైన జీవన ప్రమాణాల్లో 60.84 శాతం మార్కులతో చెన్నై తొలిస్థానం, 55.67 శాతం మార్కులతో బెంగళూరు రెండో స్థానం, భోపాల్‌ మూడో స్థానంలో ఉన్నాయి. ఇక ఆర్థిక సామర్థ్యంలో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. 100కు 78.82 శాతం మార్కులు లభించాయి. ఢిల్లీ టాప్ 2 లో ఉంది. బెంగళూరుకు సమీపంలో మరే ఇతర నగరం కూడా లేకపోవడం గమనార్హం. బెంగళూరు తర్వాత ఢిల్లీకి రెండో స్థానం 50.73 శాతం దక్కింది.