Begin typing your search above and press return to search.
ఆ ఏటీఎం రాక్షసుడిని అరెస్టు చేశారు
By: Tupaki Desk | 5 Feb 2017 3:05 PM ISTఏటీఎం దారుణాలల్లో అత్యంత కర్కశత్వానికి పాల్పడిన వ్యక్తిన ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బెంగళూరులో 2013 నవంబర్ లో ఏటీఎంలో మహిళపై కత్తితో అతి కిరాతకంగా దాడిచేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ కర్కశుడిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన మధుకర్ రెడ్డిగా గుర్తించామని పోలీస్ సూపరింటెండెంట్ జీ శ్రీనివాస్ తెలిపారు. ఇదికాకుండా మొత్తం 15 హత్య కేసుల్లో మధుకర్ నిందితుడు. 2011లో కడప జైలు నుంచి పరారైన తర్వాత నిందితుడిపై రూ. 12 లక్షల రివార్డును పోలీసులు ప్రకటించారు.
దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించి ఈ ఏటీఎం దాడి ఘటన అనంతరం నిందితుడి కోసం ఏపీ - కర్ణాటక - తమిళనాడు - కేరళ పోలీసులు విస్తృతంగా గాలించారు. ఈ క్రమంలో మదనపల్లె అతడి సొంత ఊరు కావడంతో నిందితుడు తరచూ ఊరికి వస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతడు మదనపల్లెకు వచ్చినపుడు పట్టుకున్నారు. విచారణ సందర్భంగా బెంగళూరు ఏటీఎంలో మహిళపై దాడి చేసినట్లు నిందితుడు ఒప్పుకొన్నాడని ఎస్పీ తెలిపారు. నిందితుడిని విచారించడానికి ఒక బృందాన్ని పంపామని బెంగళూరు పోలీస్ కమిషనర్ ప్రవీణ్ సూద్ పేర్కొన్నారు. మహిళపై దాడికి పాల్పడిన తర్వాత నిందితుడు కేరళకు పారిపోయాడని, హైదరాబాద్ లో అతని తల్లిదండ్రులు నివసిస్తుండటంతో సంవత్సరం అనంతరం ఇక్కడకు వచ్చాడని ఆయన వివరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/