Begin typing your search above and press return to search.
రాహుల్ గాంధీ పరువు తీసిన బెంగాల్ కాంగ్రెస్
By: Tupaki Desk | 14 Sept 2020 11:09 AM IST‘కాంగ్రెస్ ను ఎవరో వచ్చి నాశనం చేయరు.. అందులోని నేతలే చేస్తారు’ అని ఒక సామెత ఆ పార్టీలో ప్రచారంలో ఉంది. అది అక్షరాల నిజం అవుతోంది. ఇటీవలే కాంగ్రెస్ లో వృద్ధ జంబూకాలు అసమ్మతి రాజేసి సోనియాను ఎదురించి రచ్చ చేశారు. అది మరవకముందే పశ్చిమ బెంగాల్ లో తాజాగా కాంగ్రెస్ పరువు తీసే పనిచేశారు. ఇలా కాంగ్రెస్ ను కాంగ్రెసోళ్లే దెబ్బతీస్తారని మరోసారి రుజువైందని పలువురు సెటైర్లు వేస్తున్నారు.
ఇండియా అంతా ముఖ్యంగా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తికి మద్దతుగా బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ తీసింది. సుశాంత్ కేసులో స్వయంగా రియా చక్రవర్తితోపాటు ఆమె సోదరుడు మరియు వాళ్ల మేనేజర్ అంతా కలిసి డ్రగ్స్ మాఫియా నడిపించామని ఒప్పుకున్న తరువాతే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఈ డ్రగ్స్ దందాలో ఎవరున్నారో వెలికితీయాలని అందరూ కోరుకోవాలి.. కానీ కాంగ్రెస్ పార్టీ దానికి విరుద్ధంగా రియాకు మద్దతుగా ర్యాలీ నిర్వహించింది. అంటే డ్రగ్స్ దందాకు సపోర్టుగా కాంగ్రెస్ పార్టీ ఈ పనిచేసిందా అని మేధావులు కౌంటర్ ఇస్తున్నారు.
అసలు కాంగ్రెస్ పార్టీ రియాకు ఎందుకు సపోర్టు చేస్తుందో వాళ్లకే అర్థం కావడం లేదు అని.. బెంగాల్ కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందా? లేక ఏఐసీసీ నుంచి వచ్చిన ఆదేశాలా అని మేధావులు, నెటిజన్లు ఆరాతీసి ట్రోల్స్ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు.
ఎన్నికల టైంలో కాంగ్రెస్ ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదని కాంగ్రెస్ వాదులు అంటున్నారు. రియా చక్రవర్తి బెంగాలీ మూలాలున్నా అమ్మాయి కానీ.. ఆమె చేసింది అనైతికం.. అలాంటప్పుడు ఖండించాలి.. కానీ బెంగాలీ అని ఇలా కాంగ్రెస్ వెనకేసుకురావడం ఏంటని మేధావులు ప్రశ్నిస్తున్నారు.కాంగ్రెస్ చేస్తున్న ఇలాంటి పనులే ఆపార్టీని మరింత నీరుగారుస్తున్నాయని అంటున్నారు. రాహుల్ గాంధీ పార్టీ నేతల తీరుపై ఎంత అసహనం వ్యక్తం చేస్తున్నా ఆయన పరువు తీసేలా పనులు చేస్తూనే ఉండడం గమనార్హం.