Begin typing your search above and press return to search.

రాగిపాత్రలో నీళ్లు తాగడం వల్ల ఎన్నిలాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!

By:  Tupaki Desk   |   16 Jan 2021 9:30 AM GMT
రాగిపాత్రలో నీళ్లు తాగడం వల్ల ఎన్నిలాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!
X
రాగిపాత్రలో నీళ్లు తాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు. అయితే శాస్త్రీయంగా కూడా దీన్ని నిరూపించారు. ఆర్​వోఆర్​ నీళ్లు, మినరల్​ వాటర్​, ఫ్యూరిఫైడ్​ వాటర్​, ట్రీటెడ్​ వాటర్​ కంటే రాగిపాత్రలో ఉంచిన నీళ్లు తాగడం ఎంతో మేలు అని చెబుతున్నారు. రాగిపాత్రల్లో నీళ్లు తాగడం .. పురాతన కాలం నుంచి ఉన్నదే.. అయితే కాలక్రమేనా ఆ అలవాటును మనం మరిచిపోయాం. ఆ తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరికి మినరల్​ వాటర్​ తాగడం అలవాటై పోయింది. అయితే ఈ మినరల్​ వాటర్​ కంటే.. రాగిపాత్రలో నీళ్లు తాగితే ఎంతో మేలు అని చెబుతున్నారు వైద్యులు..

అయితే రాగిపాత్రలో నీళ్లు తాగితే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.. రాగి క్యాన్సర్​ కారకాలతో కూడా పోరాడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. రాగిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి వాటి ఎఫెక్ట్స్‌ని తగ్గిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆర్థ్రైటిస్, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ ల నుంచి కూడా సేఫ్ గా ఉండొచ్చు. రాగిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన రాగి త్వరగా గాయాలను మానేలా చేస్తుంది. ఇమ్యూనిటీని బలపరుస్తుంది. సీ ఫుడ్, ఆర్గన్ మీట్, హోల్ గ్రెయిన్స్, పప్పులు, నట్స్, సీడ్స్, చాకొలేట్, సిరియల్స్, బంగాళా దుంప, బఠానీ, కొన్ని ఆకు కూరల ద్వారా రాగి శరీరానికి అందుతుంది.

రాగికి పొట్ట లోపల ఇన్‌ఫ్లమేషన్‍‌ని తగ్గించి హానికారక బ్యాక్టీరియాని నశింపచేసే గుణాలు ఉంటాయి. ఫలితంగా అల్సర్స్, ఇన్‌డైజెషన్, ఇన్‌ఫెక్షన్స్ వంటి వాటికి మంచి రెమెడీలా పని చేస్తుంది. పొట్టని క్లీన్ చేసి డిటాక్స్ చేయడంలో లివర్, కిడ్నీ ఫంక్షనింగ్‌ని రెగ్యూలేట్ చేయడంలో ఫుడ్ నుండి న్యూట్రియంట్స్‌ని శోషించుకోవడంలో వేస్ట్ ని బయటకి పంపడంలో రాగి సహకరిస్తుంది. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగితే బరువు త్వరగా తగ్గుతారు.

రాగి కొవ్వుని కరిగించి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అనవసరమైన కొవ్వుని శరీరంలో ఉండనీయదు.రాగి బిందెలో నీరు శరీరానికి హాని చేసే మైక్రో ఆర్గానిజమ్స్, మోల్డ్స్, ఫంగై, ఆల్గే, బ్యాక్టీరియా వంటివి అన్ని నశించిపోయి నీరు తాగడానికి సురక్షితంగా తయారౌతుంది. రాగి పాత్రలో రాత్రంతా కనీసం నాలుగు గంటల పాటూ ఉంచితే కొన్ని గుణాలు వస్తాయట. అందుకే రాగిపాత్రలో నీళ్లు తాగండి మరి.