Begin typing your search above and press return to search.

పావురం రూ. 14 కోట్లకు అమ్ముడైంది.. ఇదో ప్రపంచ రికార్డ్​

By:  Tupaki Desk   |   17 Nov 2020 9:30 AM IST
పావురం రూ. 14 కోట్లకు అమ్ముడైంది.. ఇదో ప్రపంచ రికార్డ్​
X
ఓ రేసింగ్​ పావురం ఆన్​లైన్​లో రూ. 14 కోట్లకు అమ్ముడైంది. ఆ పావురం ఇంత ధరకు అమ్ముడు పోవడం ఇదే తొలిసారి. మాములుగా పావురం ధర వెయ్యో, రెండు వేల రూపాయలో ఉంటుంది. కానీ ఓ పావురం ఇంత ధరకు అమ్ముడుపోవడం నిజంగా ఆశ్చర్యకరం. ‘న్యూ కిమ్’ గా పిలిచే ఈ ఆడ రేసింగ్​ పావురాన్ని చైనాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ. 1.6 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 14.11 కోట్లు) చెల్లించి కొనుక్కున్నాడు. బెల్జియంలోని పీజియన్ పారడైజ్ (పిపా) అనే సంస్థ ఆ పావురాన్ని ఆన్​లైన్​లో వేలానికి ఉంచింది.

గత సంవత్సరం ‘అర్మాండో’ అనే పావురం 1.25 మిలియన్ యూరోలకు అప్పుడు పోగా.. ప్రస్తుతం ఆ రికార్డును ‘న్యూ కిమ్’ బద్దలు కొట్టిందని పిపా చైర్మన్ నికోలస్ గైసెల్బ్రెచ్ట్ తెలిపారు. తాము ఆ పావురంకి ఇంత రేటు పలుకుతుందని అస్సలు అనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘న్యూ కిమ్’ 2018లో జరిగిన ‘ఏస్ పీజియన్ గ్రాండ్ నేషనల్ మిడిల్ డిస్టెన్స్’ పోటీల్లో విజేతగా నిలిచింది. ఈ పావురం ఉత్తమ జాతికి చెందినది కావటంతో దాన్ని పోటీపడి అంత ధరకు సొంతం చేసుకున్నట్టు టాక్​.

మామూలుగా పావురాల పోటీకోసం ఇటువంటి పావురాలను అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు. బెల్జియంకు చెందిన హోక్ వాన్ డె వూవెర్ పందేల్లో వాడే పావురాలను సేకరించి వాటికి ట్రైనింగ్ ఇస్తుంటారు. కొత్త జాతి పావురాలను సృష్టిస్తుంటారు.b రేసుల్లో పాల్గొని విజేతగా నిలిచి పావురాలను పీపీ అనే ఆన్ లైన్ సంస్థ ద్వారా వేలానికి పెడుతుంటారు.