Begin typing your search above and press return to search.

భాగ్యనగరిలో పేటీఎంతో అడుక్కుంటున్నారు

By:  Tupaki Desk   |   16 Jan 2017 6:58 AM GMT
భాగ్యనగరిలో పేటీఎంతో అడుక్కుంటున్నారు
X
అడుక్కునేటోళ్లు కూడా హైటెక్ అయిపోయారు. భాగ్యనగరిని విశ్వనగరంగా మారుస్తామని.. హైటెక్ వసతుల్ని అందుబాటులోకి తీసుకొస్తామని పాలకులు చెబుతుంటారు. పాలకుల మాటలు వాస్తవ రూపం దాల్చటం తర్వాత సంగతి.. కొంతమంది హైటెక్కు తీరు నోళ్లు వెళ్లబెట్టేలా చేస్తోంది.

సంక్రాంతి సందర్భంగా వేషాలు వేసుకొని అడుక్కోవటం కొంతమంది చేస్తుంటారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ రోడ్ల మీద కనిపించింది. హనుమంతుడి వేషం వేసుకొని.. చేతిలో బ్యాట్ పట్టుకున్న వ్యక్తి.. దారిన పోయే వారిని అడుక్కుంటున్న తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. మిగిలిన వారికి ఈ అడుక్కునే వ్యక్తికి చాలానే తేడా ఉంది.

ఎందుకంటే.. ఈ బిచ్చగాడు మహా హైటెక్. తన చేతిలోని బ్యాట్ కు పేటీఎం అకౌంట్ స్టిక్కర్ అంటించి మరీ అడుక్కుంటున్నాడు. నోట్లరద్దు నేపథ్యంలో ఈ పద్దతిలో అడుక్కోవటం బెటర్ అనుకున్నాడో ఏమో కానీ.. బ్యాట్ మీద పేటీఎం స్టిక్కర్ అంటించాడు. దారిన పోయే వారిని ఆపి మరీ.. తన అకౌంట్లోకి బిచ్చాన్ని బదిలీ చేయమని కోరటం గమనార్హం. ఈ హైటెక్ బిచ్చగాడిని.. అతగాడి తెలివికి షాక్ తింటూ కొందరు డబ్బులు వేస్తే.. మరికొందరు తిట్టేయటం కనిపించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/