Begin typing your search above and press return to search.

ఆ సైట్లు చూసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   28 Jun 2016 6:47 AM GMT
ఆ సైట్లు చూసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?
X
కొంతమంది కంప్యూటర్లో కానీ.. వెబ్ సైట్లు కానీ చూస్తున్నప్పుడు.. వాటిల్లోని కొన్ని అశ్లీల సైట్లకు సంబంధించిన ఫోటోలు యాడ్స్ రూపంలో వస్తుంటాయి. ఇక.. అలాంటి వారి సిస్టమ్స్ లో యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే.. అశ్లీల కంటెంట్ తో ఉన్న యాడ్స్ జోరుగా కనిపిస్తుంటాయి. ఎందుకిలా? అంటే.. దానికో లెక్క ఉందని చెబుతున్నారు. ఎవరికైనా పోర్న్ వెబ్ సైట్లు (అదేనండి బూతు వెబ్ సైట్లు).. పోర్న్ సినిమాలు చూసే అలవాటు ఉంటే.. అలాంటి వారి నిర్లక్ష్యం వల్లనే ఇలాంటివి చోటుచేసుకుంటాయని చెబుతున్నారు.

ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఎవరికైనా పోర్న్ వెబ్ సైట్లు చూసే అలవాటు ఉందని అనుకుందాం. వారు అలాంటి సైట్లు చూస్తునే.. తమ గూగుల్ అకౌంట్.. ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి.. ఇలాంటి సినిమాలు.. బొమ్మలు చూస్తే.. అలా వినియోగించే వినియోగదారుడి మనసును ట్రాక్ చేసే సిస్టం ఫేస్ బుక్.. గూగుల్ కు ఉంటుంది. దీంతో.. వారి అభిరుచిని అర్థం చేసుకున్న.. ఈ వెబ్ సైట్లు.. తర్వాతి రోజుల్లో తమ అకౌంట్లు ఓపెన్ చేసినప్పుడు.. వారికి నచ్చిన.. మనసు మెచ్చిన బూతు వెబ్ సైట్లకు చెందిన యాడ్స్ ను వచ్చేలా చేస్తాయి. అందుకే.. కొంతమంది యూట్యూబ్.. ఫేస్ బుక్ పేజీలు ఓపెన్ చేసినప్పుడు అశ్లీల కంటెంట్ కంటికి కనిపించేది. సో.. బూతు సైట్లు చూడాలనుకుంటే.. ముందుగా గుగూల్.. ఫేస్ బుక్ అకౌంట్లను బుద్ధిగా క్లోజ్ చేసిన తర్వాతే చూడాలని నిపుణులు చెబుతున్నారు. లేకుంటే.. అందరి ముందు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.