Begin typing your search above and press return to search.

చిదంబ‌రానికి ముందుచూపెక్కువ

By:  Tupaki Desk   |   1 March 2018 11:04 AM GMT
చిదంబ‌రానికి ముందుచూపెక్కువ
X
ఐఎన్ఎక్స్ కేసులో అబ్బా- కొడుకు తెగ బ‌య‌ప‌డిపోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబ‌రం కుమారుడు కార్తి చిదంబ‌రాన్ని సీబీఐ అరెస్ట్ చేసింది.

ఐఎన్ ఎక్స్ మీడియా పేరుతో పీటర్ ముఖార్జియా తన భార్య ఇంద్రాణి ముఖార్జియా అధినేత‌గా చేరుస్తూ 2007లో ఐఎన్ఎక్స్ న్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, ఐఎన్ఎక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఐపిఎం ఇన్‌కోన్ ప్రైవేట్ లిమిటెడ్, ఐఎన్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ సెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి పలు డొల్ల కంపెనీల‌ను స్థాపించారు.

ఆ కంపెనీల పేరుతో విదేశీ పెట్టుబ‌డుల ప్రోత్స‌హాకాల బోర్డు (ఫెరా) నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ప‌లు విదేశీ కంపెనీల నుంచి నిధుల సేక‌రించి వాటిని దుర్వినియోగం చేశారు.

ఈ నేప‌థ్యంలో క‌న్న‌కూతుర్నిహ‌త్య చేసిన ఇంద్రాణి ముఖార్జియా అరెస్ట్ చేసిన పోలీసులు కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ద‌ర్యాప్తులో డొల్ల‌కంపెనీల పేరుతో కోట్లు రూపాయ‌ల్ని అక్ర‌మ మార్గంలో సేక‌రించి వాటిని దుర్వినియోగం చేసిన‌ట్లు తేలింది.

ఈ దుర్వినియోగం లో ఎవ‌రి పాత్ర ఎంత ఉంది..? త‌దిత‌ర అంశాల‌పై లోతుగా విశ్లేషించిన సీబీఐకి కార్తి చిదంబ‌రంపై అనుమానం వ‌చ్చింది.

అనుమానం రావ‌డ‌మే త‌రువాయి విచార‌ణ చేప‌ట్టింది. ఐఎన్ఎక్స్ సంస్థ‌లతో చేతులు క‌లిపి ..వివిధ మార్గ‌ల ద్వారా డ‌బ్బు సేక‌రించిన పీటర్ ముఖార్జియా తన భార్య ఇంద్రాణి ముఖార్జియాలు కార్తి చిదంబ‌రానికి రూ. 10కోట్లు ముట్టజెప్పారు.

కార్తి చిదంబ‌రం తండ్రి చిదంబ‌రం కేంద్ర‌మంత్రిగా ఉన్నాడు. దీన్నే అదునుగా భావించిన ఐఎన్ఎక్స్ స‌భ్యులు పీటర్ ముఖార్జియా తన భార్య ఇంద్రాణి ముఖార్జియా భారీ అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డారు. చ‌ట్టానికి క‌ళ్లు క‌ప్పి త‌ప్పించుకునేందుకు కార్తి చిందంబ‌రానికి భారీ మొత్తంలో ముడుపులు అందించారు.
ఇదిలా ఉంటే ఇంద్రాణి ముఖ‌ర్జియా అరెస్ట్ తో ఐఎన్ ఎక్స్ అవినీతి కేసును విచారించిన సీసీబీ కార్తి చిదంబ‌రానికి నోటీసులు జారీ చేసింది.

సీబీఐ కేసు విచారణ జరుగుతుండగా.. ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే విధించాలని లేదా వాయిదా వేయాలని కార్తీ తండ్రి ముంద‌స్తుగానే చిదంబరం ముంద‌స్తుగానే సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

అంతేకాదు విచార‌ణ పేరుతో నన్ను, నాకుటుంబ‌స‌భ్య‌ల్ని వేధిస్తున్నార‌ని, రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఇవి జరుగుతున్నాయి. దర్యాప్తు సంస్థల వేధింపులను అడ్డుకోండి..' అని కోరుతూ స్వయంగా సుప్రీంలో పిటిషన్‌ వేశారు. కానీ, ఈ పిటిషన్‌ విచారణకు రాకముందే కార్తీని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.