బీరు తాగండి...తలనొప్పి తగ్గించుకోండి!

Wed Nov 20 2019 07:00:02 GMT+0530 (IST)

beer health benefits

మందు తాగడం గురించి ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. అయితే మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అనేది నిజం. ఎప్పుడో రెండు పెగ్గులు వేసి రిలాక్స్ అవడం అనేది కొందరి అలవాటు. ఇలా కాకుండా బీర్ తాగి ఇటు ఆరోగ్యం ఎక్కువ నాశనం అవకుండా చూసుకోవడం...అటు తాగిన తృప్తి పొందడం కొందరికి నచ్చుతుంది. ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా  తలనొప్పికి కూడా బీర్ చక్కగా పనిచేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్ విచ్ అధ్యయనంలో తేలిందట.ధాన్యపు గింజల నుంచి బీరుని తయారు చేయడం వల్ల బీర్‌లో విటమిన్ బితో పాటుగా  మెగ్నీషియం - సెలీనియం - పొటాషియం - ఫాస్పరస్ - ఈస్ట్ -  కాల్షియం - కాపర్ - ఐరన్ - పొటాషియం - సిలికాన్ - సోడియం - ఫాస్ఫరస్ - మెగ్నీషియం - సెలీనియం - జింక్ వంటి మినరల్స్ లభిస్తాయని వంటివి పుష్కలంగా ఉంటాయన్నదానికి తోడుగా... రోగాలను కూడా నయం చేస్తుందనే  విషయం తమ అధ్యయనంలో తేలిందని యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్ విచ్ పరిశోధకుడు డాక్టర్ ట్రెవర్ థామ్సన్ ప్రకటించారు. 18 అంశాలను తీసుకొని 400 మందిపై జరిపిన అధ్యయనంలో తగిన మోతాదులో బీర్ తీసుకుంటే సాధారణంగా తలనొప్పికి తీసుకునే పారాసిటమాల్ కంటే బాగా పని చేస్తుందని తాము కనుగొన్నామని వెల్లడించారు.

అనేక పోషకాలు ఉండటం...పెయిన్ కిల్లర్ అయిన పారసిటమల్ కంటే బాగా పనిచేస్తుందని తేలిన నేపథ్యంలో..బాగా తలనొప్పి వచ్చినప్పుడు ఓ రెండు గ్లాసుల బీరును లాగించేస్తే సరిపోతుందని అనుకుంటున్నారా? ఈ పరిశోధన చేసిన డాక్టర్ ట్రెవర్ థామ్సన్ ఈ సందర్భంగా ఓ హెచ్చరిక కూడా చేశారు. అదే పనిగా బీర్ తాగితే దానికుండే సైడ్ ఎఫెక్టులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అంటే...తలనొప్పిని టాబ్లెట్ తో దూరం చేసుకోవాలా లేదంటే...బీర్ తాగి కొత్త రోగాలు తెచ్చుకోవాలా అనేది మన చేతుల్లోనే ఉందన్న మాట.