Begin typing your search above and press return to search.

ఒక్క ఓవర్​ తో సూపర్​ హీరో అయ్యావు కదా భయ్యా..!

By:  Tupaki Desk   |   26 April 2021 11:30 AM GMT
ఒక్క ఓవర్​ తో సూపర్​ హీరో అయ్యావు కదా భయ్యా..!
X
నిన్న సాయంత్రం నుంచి రవీంద్ర జడేజా పేరు సోషల్ మీడియాలో మారుమోగి పోతోంది. అందుకు కారణం. ఒకే ఓవర్​. ఒకే ఒక్క ఓవర్​ జడేజాను హీరోను చేసింది. చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టుకు భారీ విజయాన్ని చేకూర్చింది. అంతేకాక భారీ స్కోర్​ ను కూడా అందించింది. నిన్న రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు జట్టుతో సీఎస్​కే తలపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆఖరి ఓవర్​ ను హర్షల్​ పటేల్​ వేశాడు. హర్షల్​ పటేల్​ ప్రస్తుతం పర్పుల్​ క్యాప్​ రేసులో దూసుకుపోతున్నాడు. ఐపీఎల్​ సీజన్​ లో అత్యధిక వికెట్లు పడగొట్టే వారికి ఈ క్యాప్​ బహూకరిస్తుంటారు.

కోహ్లీ ఆఖరి ఓవర్​ ను హర్షల్​ పటేల్​ కు ఇచ్చాడు. అయితే ఈ టైంలో స్ట్రైక్​లోకి వచ్చిన జడేజా .. హర్షల్​ బౌలింగ్​ ను ఉతికి ఆరేశాడు. ఒకే ఓవర్​ లో 37 పరుగులు తీశాడు. హర్షల్​ ఓ బంతిని నో బాల్​ వేయడం కూడా అందుకు ఓ కారణం. నో బాల్​ వేయడంతో ఆ బంతిని సిక్స్​గా మలిచిన జడేజా.. ఫ్రీ హిట్​ ను కూడా సిక్స్​గా మలిచాడు. దీంతో ఒకే ఓవర్​ లో 37 పరుగులు వచ్చాయి. దీంతో సోషల్​ మీడియాలో విపరీతంగా ట్రోల్స్​ చేస్తున్నారు సీఎస్​కే ఫ్యాన్స్​.

జడేజా బౌలింగ్​తోనూ అదరగొట్టాడు. 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అవి కూడా మ్యాక్స్‌వెల్, డివిలియర్స్‌లవి కావడం విశేషం. గతంలో జడేజా పై ప్రముఖ కామెంటేటర్​ సంజయ్​ ముంజ్రేకర్​ కామెంట్లు చేశాడు. అతడు అటు బ్యాటింగ్​, ఇటు బౌలింగ్​ కు పనికిరాడంటూ వ్యాఖ్యానించాడు. దీంతో అతడిపై ప్రస్తుతం నెటిజన్లు ఆరోపణలు చేస్తున్నారు. సంజయ్​ ముంజ్రేకర్​ ఇప్పుడేమంటావ్​? అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు జడేజా ఫొటోలను ఎడిట్​ చేసి వైరల్​ చేస్తున్నారు.