Begin typing your search above and press return to search.

హుజూర్‌న‌గ‌ర్లో కారు బేజారు ఎందుకంటే

By:  Tupaki Desk   |   19 Oct 2019 7:10 AM GMT
హుజూర్‌న‌గ‌ర్లో కారు బేజారు ఎందుకంటే
X
హుజూర్‌న‌గ‌ర్‌లో గులాబీ బేజార‌వుతోందా..? మునుపెన్న‌డూ లేని విధంగా త‌డ‌బాటుకు గుర‌వుతోందా ? ఏం జ‌రుగుతుందో తెలియ‌క గులాబీ శ్రేణుల్లో గంద‌ర‌గోళం నెల‌కొందా ? అంటే తాజా ప‌రిస్థితులు మాత్రం అవున‌నే అంటున్నాయి. నిజానికి.. ఎన్నిక‌లు ఏవైనా.. ఎప్పుడు వ‌చ్చినా.. టీఆర్ఎస్ దూకుడు ప్ర‌ద‌ర్శించేది. ప్ర‌చారంలో ఎవ్వ‌రికీ అంద‌నంత ముందు వ‌రుస‌లో ఉండేది. ఇక ఆఖ‌రి అస్త్రంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ స‌భ నిర్వ‌హిస్తారు. ఇక దానితో ప్ర‌జ‌ల మూడ్ మొత్తం త‌మ‌వైపు తిప్పుకుంటారు. కానీ.. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నికలో మాత్రం భిన్న‌మైన ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది.

నిజానికి.. ఇక్క‌డ కూడా షెడ్యూల్ విడుద‌ల కాగానే.. అంద‌రికంటే ముందుగానే గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన సైదిరెడ్డికే సీఎం కేసీఆర్ మ‌ళ్లీ టికెట్ ఇచ్చారు. అప్ప‌టి వ‌ర‌కు బాగానే ఉంది. ఈనెల 4న పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప‌ర్య‌టించారు. కానీ.. ఆర్టీసీ కార్మికుల స‌మ్మెతో అంచ‌నాల‌న్నీ త‌ల‌కిందుల‌య్యాయి. కేటీఆర్ త‌న ప‌ర్య‌ట‌న‌ల‌ను ర‌ద్దు చేసుకున్నారు. ఆ త‌ర్వాత ఆఖ‌రి అస్త్రంగా ఈనెల 17న కేసీఆర్ స‌భ నిర్వ‌హించాల‌ని చూసినా.. చివ‌ర‌కు వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది. స‌భ ర‌ద్దుపై విప‌క్షాలు మ‌రో కార‌ణం కూడా చెబుతున్నాయి.

స‌భ‌కు రాలేక‌నే ర‌ద్దు చేసుకున్నార‌ని కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. అయితే.. ఆఖ‌రి అస్త్రం స‌భ కూడా ర‌ద్దు కావ‌డంతో గులాబీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయాయి. ఇదే స‌మ‌యంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందన్న ప్రచారం రోజురోజుకూ తీవ్రమవుతోంది. దీనికి తోడు ఆర్టీసీ సమ్మె ఉధృతం కావ‌డం.. రోజురోజుకూ వారికి అన్నివ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు పెర‌గడంతో టీఆర్ఎస్ నాయ‌కులు ఆందోళ‌న చెందుతున్నారు. నిజానికి.. ఇప్పుడు దిశానిర్దేశం చేసే వారు క‌రువ‌య్యార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

ప్ర‌చారంలో పెద్ద నేత‌లెవ‌రూ లేక‌పోవ‌డంతో తీవ్ర నిరాశ‌కు గుర‌వుతున్నారు. ప్ర‌స్తుతం మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ మాత్రమే చివరి వరకు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్క‌డే మ‌రొక విష‌యం కూడా ఉంది. జగదీశ్‌రెడ్డికి కాకుండా.. ఉప ఎన్నిక ఇన్‌చార్జి బాధ్యతలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించడంతో స్థానిక నేత‌ల్లో కొంత అసంతృప్తి నెల‌కొంది. దీంతో నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌య‌లోపం క‌నిపిస్తోంది.

ఇక్క‌డ మ‌రొక ప్ర‌ధాన‌మైన అంశం ఏమిటంటే.. అధికారులు కూడా టీఆర్ఎస్‌కు స‌హ‌క‌రించే ప‌రిస్థితులు లేవు. ఎన్నిక‌ల సంఘం చాలా సీరియ‌స్‌గా ఉండ‌డంతో పోలీస్‌, రెవెన్యూ, ఎక్సైజ్‌ విభాగాలు షాక్‌కు గురయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్‌ కీలకనేతలతో పాటు మండల స్థాయి నేతల వరకు అధికారులను నీడలా వెంటాడుతున్నారు. ఇప్ప‌టికే ఎస్పీ, ఎక్సై జ్‌ సీఐను బదిలీ చేయడంతోపాటు అధికార పార్టీ అభ్యర్థి సైదిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.