Begin typing your search above and press return to search.

ఆ దీవి అడుగు పెడితే ప్రాణాలు పోవడమంతే..!

By:  Tupaki Desk   |   2 Sept 2021 5:00 AM IST
ఆ దీవి అడుగు పెడితే ప్రాణాలు పోవడమంతే..!
X
ఉరుకుల పరుగుల జీవనంలో కొంత కాలం పాటు పనులన్నీ వదిలేసి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని చాలా మంది అనుకుంటారు. ఏదైనా దీవిలో అయితే ప్రశాంతంగా మనస్సుకు రిలీఫ్ దొరుకుతుందని చర్చించుకుంటు ఉంటారు. అలాంటి వాళ్లను మనం చూడొచ్చు. నిజమే దీవిలో అయితే, నీటిని చూసుకుంటూ ప్రశాంతంగా సంద్రపు తీరాన అలల తాకిడిలో ఉంటూ హ్యాపీగా రిలీఫ్ పొందొచ్చు అనుకుంటారు. అయితే, మనం తెలుసుకోబోయే ఈ దీవి మాత్రం ఒక రకంగా భయంకరమైనదనే చెప్పొచ్చు. ఆ దీవిలో అందమైన ప్రకృతి కంటే కూడా ఎక్కడ చూసినా మనుషుల పుర్రెలు, అస్థిపంజరాలే కనిపిస్తాయి.

భూతల స్వర్గం అని ఆ దీవిని అనలేం. అది ఎక్కడుందంటే.. నీటిపై తేలియాడే సిటీ వెనీస్. ఈ సిటీకి 16 కిలోమీటర్ల దూరంలో ఓ అందమైన దీవి ఉంది. అక్కడ ప్రజలు నివసించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కానీ, మౌలిక సదుపాయాలు మాత్రం అంతంతే.. ఆ దీవిలో కాలు మోపాలంటే జనాలు భయపడిపోతంటారు. ఆ దీవి పేరు‘పోవెగ్లియా’ కాగా స్థానికులు దీనిని శవాల దిబ్బ అని పిలుస్తుంటారు. ఇది శ్మశానమైతే కాదు. దీని గత చరిత్రలోకి వెళ్తే..ఒకప్పుడు ప్లేగు వ్యాధితో నరకయాతన అనుభవించారు ఇక్కడ. 16వ శతాబ్దంలోనే సుమారు లక్ష మంది పైగా జనం అక్కడ మరణించారని స్థానికులు అంటున్నారు. అయితే, కాలక్రమేణా ఆ ప్రాంతంలో ప్రజలు నివసించడం మానేశారు. అయినప్పటికీ వెనీస్ సిటీ తదితర ప్రాంతాలకు సందర్శనకు వచ్చిన క్రమంలో పర్యాటకులు ఇక్కడకు కూడా వచ్చేవారు.

16వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి ఇటలీని భయాందోళనకు గురిచేసిన క్రమంలో వ్యాధిగ్రస్తులను అక్కడే ఉంచారని స్థానికులు వివరిస్తున్నారు. దాంతో అది మరింత మందికి సోకుతుందనే ఉద్దేశంతో శవాలను, రోగులను తీసుకెళ్లి ‘పోవెగ్లియా’లో వదిలేసేవారు. ఫలితంగా రోగులు ఆ శవాల మధ్యే జీవించేవారు. తిండి లేక, రోగానికి చికిత్స లభించక అక్కడే ప్రాణాలు కోల్పోయారు. అందులో చిన్నారులు కూడా ఉండటం గమనార్హం. ఈ పరిస్థితులపై అప్పట్లో మానవ హక్కుల కార్యకర్తలు కొట్లాడారు. పౌర హక్కుల సంఘాలు, కార్యకర్తల పోరాటంతో అక్కడ రోగులు ఉండేందుకుగాను ప్రభుత్వం భవనం నిర్మించింది.

ఇక ఆ దీవిని ప్రజల కోసమై అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నఅనుకుంది. కానీ, ప్రజలు అక్కడికి వెళ్లడనాకి అస్సలు మొగ్గు చూపలేదు. ఈ క్రమంలోనే అక్కడ మెంటల్ ఆస్పత్రి కట్టించగా, అటు వైపు వెళ్తే చిత్ర విచిత్రంగా బిహేవ్ చేసే పేషెంట్స్ కనిపిస్తుంటారు. వారిని చూసి ఇక జనాలు అటు వైపు వెళ్లడమే మానేశారు. అయితే, ఇవేవీ పట్టించుకోకుండా ఈ దీవి సందర్శనకు వెళ్లే పర్యాటకులు సైతం ఉండటం గమనార్హం. ప్రశాంతమైన దీవిలో కొంత సేపు గడిపితే మనశ్శాంతి లభిస్తుందనేది వారి నమ్మకం.

వెనీస్ సిటీ సమీపంలోని ఈ దీవిలో పర్యాటకులను అనుమతించబోరు. అక్కడకు వెళ్లాలనుకునేవారు తప్పకుండా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకున్న తర్వాతే అక్కడకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, దయ్యాలకు ఇది ఫేవరెట్ ప్లేస్ అని చాలా మంది చర్చించుకుంటుండటం గమనార్హం. ఈ దీవిని లుగీ బ్రుగనరో అనే బిజినెస్ మ్యాగ్నెట్ వేలం పాటలో ఏడు లక్షల డాలర్లకుగాను 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నాడు. దీవి గురించి ఎన్ని భయంకర విశేషాలు చెప్పినప్పటికీ కొందరు దీవిలోకి వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు.