Begin typing your search above and press return to search.

శిరీష ఆడియో టేప్ బయటకు వచ్చింది

By:  Tupaki Desk   |   20 Jun 2017 7:45 AM GMT
శిరీష ఆడియో టేప్ బయటకు వచ్చింది
X
అనుమానాస్పద రీతిలో మరణించిన బ్యూటీషియన్ శిరీష ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. తొలుత ఆమె మరణాన్ని అనుమానాస్పద మరణంగా పేర్కొన్న పోలీసులు.. తర్వాత తమకు లభించిన ఆధారాల నేపథ్యంలో ఆత్మహత్యగా కన్ఫర్మ్ చేయటం తెలిసిందే.

అయితే.. పోలీసులు సూసైడ్ గా నిర్ధారించినప్పటికీ శిరీష కుటుంబ సభ్యులు మాత్రం ఆమెది అనుమానాస్పద మృతిగానే చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. శిరీషకు సంబంధించిన ఒక ఆడియో టేప్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. రాజీవ్ తో తేజస్విని చనువుగా ఉండటాన్ని శిరీష తట్టుకోలేకపోయిందన్న వాదనకు బలం చేకూరేలా సదరు టేప్ ఉండటం గమనార్హం.

తేజస్విని తనకు ఎనిమీ (శత్రువు) అని చెప్పిన ఆడియో క్లిప్ ఒకటి ఇప్పుడు కొన్ని మీడియాల్లో హడావుడి చేస్తున్నాయి. తేజస్వినితో రాజీవ్ చనువుగా ఉండటాన్ని శిరీష తట్టుకోలేకపోయిందన్నట్లుగా ఈ టేపుల్లో మాటలు ఉన్నాయి. తేజస్వినితో మాట్లాడిన టేపుల్ని తనకు ఇవ్వాలంటూ రాజీవ్ స్నేహితుడు నవీన్ ను శిరీష రిక్వెస్ట్ చేసిన వైనం తాజాగా బయటకు వచ్చిన టేపుల్లో ఉంది.

ఆరే ఫోటోస్టూడియోలో పని చేస్తున్న శిరీషకు, ఆ సంస్థ యజమాని రాజీవ్ కు మధ్య ఉన్న చనువు వివాహేతర సంబంధానికి దారి తీసింది. అనంతరం కొంతకాలానికి రాజీవ్‌ - తేజస్విని ల వ్యవహారం తెలిసిన శిరీష‌ తట్టుకోలేకపోయిందని.. ఆగ్రహం చెందిందన్న వాదనలు వినిపించాయి. వీటికి బలం చేకూరేలా తాజా టేప్ ఉండటం గమనార్హం.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/