Begin typing your search above and press return to search.
బీచ్ మిస్టరీ.. ఈ రహస్యమైన జంతువేంటో తెలుసా?
By: Tupaki Desk | 21 May 2021 4:00 PM ISTఈ సృష్టిలో మానవుడితో పాటు ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. ప్రతీ జీవిని మానవుడు గుర్తించలేడు. మనిషికి తెలియని జీవులు ఎన్నో ఉన్నాయి అనడానికి ఇది ఉదహరణ. ఈ వింత ఆకారాన్ని చూసిన అధికారులు షాకయ్యారు. ఇదేంటో తెలుసుకోలేక తలలు పట్టుకున్నారు. చివరకు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి నెటిజన్ల సలహా కోరుతున్నారు. ఇప్పటివరకు ఆ పదార్థమేంటో కచ్చితంగా గుర్తించలేకపోయారు.
ఈ వింత ఆకారంలో ఉన్న పదార్థాన్ని నార్త్ కోరోలినా తీరంలో అధికారులు గుర్తించారు. తెల్లని బాల్స్ ని కలిగి ఉన్న ఈ జంతువుని చూసి స్థానికులు భయపడుతున్నారు. కాళ్లు, చేతులు, తల వంటి భాగాలు ఏమీ లేవు. ఇది జీవి అనాలా? పదార్థం అనాలో? తెలియని పరిస్థితి. అంతు చిక్కని పదార్థం అనే క్యాప్షన్ తో దీనిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఇది ఏంటి? అని అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా కొన్ని నెలల క్రితం సముద్రం నుంచి ఇది కొట్టుకువచ్చిందని స్థానికులు తెలిపారు. దీని ఉనికి ఏంటో గుర్తించలేకపోతున్నట్లు వెల్లడించారు.
అనేక ఆకారాలు కలిగిన ఈ పదార్థాన్ని చూసిన అధికారులు స్క్విడ్ గుడ్డు అని అభిప్రాయపడుతున్నారు. తిరిగి సముద్రంలోనే వదిలేయాలా? అని ఆలోచిస్తున్నారు. బీచ్ అప్డేట్స్ అంటూ అధికారులు దీనిని పోస్ట్ చేశారు. ఇదేంటే తాము గుర్తించలేకపోతున్నామని... ఈ రహస్య జంతువు గురించి తెలుసా? అంటూ ప్రశ్నించారు. కొన్ని నెలల క్రితం బీచ్లో కనుగొన్నామని పేర్కొన్నారు.
ఈ పదార్థం గురించి తెలిస్తే చెప్పండి అని అడిగారు. దీనిని గుర్తించడంలో తమకు సాయం చేయాలని కోరారు. ఈ పోస్టుపై నెటిజన్లు స్పందించారు. ఇది స్క్విడ్ గుడ్డు అని తేల్చారు. సముద్రంలోనే వదిలేయాలని సూచించారు. మొత్తానికి ఈ అంతుచిక్కని పదార్థం అధికారులు గుర్తించలేకపోతున్నారు. చివరకు సముద్రంలో వదిలేస్తారేమో చూడాలి.