Begin typing your search above and press return to search.
లైవ్ స్టాక్ తో జాగ్రత్త.. లేకుంటే ప్రమాదమే?
By: Tupaki Desk | 6 July 2021 6:00 PM ISTప్రస్తుత ప్రపంచం కంటికి కనిపించని వైరస్‌తో పోరాటం చేస్తోంది. వైరస్ ఎలా పుట్టింది. మనిషికి ఎలా సోకింది. అనేక సందేహాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే కరోనా వైరస్ జంతువుల నుంచి మొదట వ్యాప్తి చెందింది అని నమ్మేవారు ఎక్కవ. అయితే జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకడం కొత్త కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ కరోనా వైరస్ మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేయడం ఆందోళన కలిగిస్తుంది.
టెక్నాలజీతో దూసుకుపోతున్న మనిషి ప్రయాణానికి ఈ కరోనా వైరస్ బ్రేక్ వేసింది. ఈ వైరస్ గబ్బిలం నుంచి మనుషులకు సోకి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది. ఈ రెండేండ్లలో ప్రపంచాన్ని చిన్న వైరస్ స్థంభింపజేస్తోంది. అయితే ఒక్క గబ్బిలం నుంచే కాదు. మన చుట్టూ ఉన్న పెంపుడు జంతువుల నుంచి కూడా వైరస్‌లు వ్యాప్తి చెందుతాయి. అదే విధంగా మనుషుల నుంచి జంతువులకు కూడా వ్యాధులు సంక్రమిస్తున్నాయి. వాటి వలనే కొత్త రకం వ్యాధులు పుట్టుకొస్తున్నాయి.
నాటి నుంచి నేటి వరకు జూనోసెస్ ద్వారా ఎన్నో రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. కుక్కల నుంచి రేబిస్, గబ్బిలం నుంచి నిఫా, పశువుల నుంచి మ్యాడ్ కౌ, కోళ్ల నుంచి ఫ్లూ వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఈ వ్యాధులు మనిషిపై ఎక్కవ ప్రభావం చూపలేదు. రేబీస్, ప్లేగు, టీబీ, కలరా, మలేరియా, సాల్మోనెల్లా, స్కాబీస్ వ్యాధులు సోకినా ప్రమాదం అంతగా లేదు. చాలా వాటికి టీకాలతో ప్రమాద తీవ్రత తగ్గించగలిగారు. కానీ ఇటివల కాలంలో సార్స్, ఎబోలా, జీకా, నిఫా, సాల్మోనెల్లా, కరోనాలు మానవ మనుగడపై తీవ్ర ప్రభావం చూపాయి.
జూనోసిస్ వ్యాధుల నివారణ, చికిత్స కోసం 1885 జులై 6న లూయి ప్యాక్చర్ కుక్క కాటుకు రేబిస్ వ్యాక్సిన్ కనిపెట్టాడు. అందుకే ప్రతి ఏటా జూలై 6న జూనోసెస్ డే నిర్వహిస్తారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది జూనోసెస్ డే పట్ల ప్రపంచం వ్యాప్తంగా ఆసక్తి కనిపించడం లేదు. కరోనా చేసిన విలాయం ఎన్నో జీవితాలను రోడ్డున పేడేసింది .
ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ జనాభా పెరుగుతోంది. దీంతో వారికి కావాల్సిన ఆహారం కోసం కోళ్లు, మేకలు, పందులు, పశువులు, పక్షులు (లైవ్ స్టాక్)లతో పాటు ఇతర జంతువులపై ఆధారపడుతున్నారు. . మాంసాహారం కోసం భారీ ఎత్తున లైవ్ స్టాక్ పెడుతున్నారు. జంతువుల నుంచి మనుషులకు వైరస్ వ్యాప్తి పెరిగిపోతుంది. దీన్నీ అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని నిఫుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా తెచ్చిన అనుభవంతో లైవ్ స్టాక్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.