Begin typing your search above and press return to search.

రాజధాని పై బీసీజీ.. బోస్టన్ కంపెనీ కథ ఇదీ

By:  Tupaki Desk   |   28 Dec 2019 5:08 PM IST
రాజధాని పై బీసీజీ.. బోస్టన్ కంపెనీ కథ ఇదీ
X
ఏపీ రాజధానిపై సీఎం జగన్ ఏర్పాటు చేసిన జీఎన్ రావు నివేదిక ఇచ్చింది. అయితే బోస్టన్ కన్సల్టింగ్ కంపెనీ (బీసీజీ) నివేదిక వచ్చాక రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ తెలిపారు. ఇంతకీ ఈ బీసీజీ కంపెనీ కథేంటి? ఆ కంపెనీ ఎలాంటి అధ్యయనం చేస్తుంది? నివేదిక లో ఏం చెప్తుంది? ఎందుకు జగన్ అండ్ కో దాని నివేదికనే ప్రామాణికంగా తీసుకున్నారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

*బీసీజీ ఎక్కడిది? ఏం చేస్తుంది?
అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక కంపెనీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు.. ఇది 1963లో స్థాపించారు. దాదాపు 50 దేశాల్లో సుమారు 90 బ్రాంచులతో ఇది ప్రపంచంలోనే ది బెస్ట్ కంపెనీ గా సేవలందిస్తోంది. ఆయా దేశాలకు మౌళిక సదుపాయాల కల్పనపై ప్రాజెక్టులను రూపొందించడం బీసీజీ గ్రూపు పని..

*దీని అనుభవమేంటి?
దేశంలోని ముంబై, సహా గోవా, వైజాగ్, చెన్నై, కోల్ కతా, మంగళూరు, కొచ్చిన్, చిదంబరం, పారదీప్ లాంటి ఎన్నో పోర్టుల అభివృద్ధికి బోస్టన్ గ్రూపు సలహాలిచ్చింది. రహదారులు, పోర్టులు, ఇతరత్రా మౌళిక సదుపాయాల కల్పనపై ఈ సంస్థ అధ్యయనం చేసి సూచనలిస్తుంది. అందుకే ఏపీ రాజధాని బాధ్యతను జగన్ సర్కారు ఈ కంపెనీకి అప్పగించింది.

*బోస్టన్ మధ్యంతర నివేదిక
ఇది వరకే బోస్టన్ కంపెనీ మధ్యంతర నివేదికను జగన్ కు ఇచ్చింది. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా గ్రీన్ ఫీల్డ్ కంటే బ్రౌన్ ఫీల్డ్ రాజధాని బెటర్ అని సూచించింది.

*బ్రౌన్ ఫీల్డ్ అంటే విశాఖే
బ్రౌన్ ఫీల్డ్ రాజధాని అంటే అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతంలో రాజధాని నిర్మాణం బెటర్ అని బీసీజీ సలహాలిచ్చింది. దీన్ని బట్టి విశాఖను ప్రభుత్వం ఎంపిక చేసింది. గ్రీన్ ఫీల్డ్ అంటే చంఢీఘడ్ లాంటి రాజధాని.. అంటే కొత్తగా రాజధానిని ఒక చోట నిర్మించడం అన్నమాట.. దీనివల్ల వ్యవసాయ భూములు, భూసేకరణ,పర్యావరణ లాస్ ఎక్కువ.

ఇలా బీసీజీ మధ్యంతర నివేదిక ప్రకారమే జగన్ సర్కారు విశాఖను ఎంపిక చేసినట్టు తెలిసింది.