Begin typing your search above and press return to search.
క్రికెట్ ప్రియులకు షాక్: విదేశాల్లో ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ సమాలోచనలు
By: Tupaki Desk | 5 Jun 2020 10:55 AM GMTక్రికెట్ అంటే భారతీయులకు పిచ్చి. ప్రతి మ్యాచ్‌ను మొదటి బంతి నుంచి చివరకు బహుమతుల ప్రదానోత్సవం వరకు చూసి తీరుతారు. అలాంటి వారికి ఐపీఎల్ అనేది ఓ పండుగ. ప్రస్తుతం వేసవిలో ప్రారంభం కావాల్సి ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 లాక్‌డౌన్ వలన వాయిదా పడింది. అప్పుడే నిరాశ చెందిన క్రికెట్ అభిమానులు, ప్రేక్షకులు ఇప్పుడు బీసీసీఐ తీసుకోబోతున్న నిర్ణయంపై మరింత షాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌తో ఐపీఎల్ నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఈ ఐపీఎల్ నిర్వహణ భారత్‌లో సాధ్యం కాదని తెలుస్తోంది. వైరస్ ఇంతలా వ్యాప్తి చెందుతుండడంతో విదేశీ క్రికెటర్లు రాకపోయే అవకాశం ఉంది. దీంతో ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించాలని యోచిస్తున్నారు.
వీటిలో ఏ దేశం సురక్షితం అనే దానిని బీసీసీఐ పరిశీలిస్తోంది. ఈ క్రమంలో అనేక దేశాలు లాక్‌డౌన్ సడలింపులు ఇస్తుండడంతో ఆయా దేశాల్లో క్రికెట్ కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. ఇంగ్లండ్, శ్రీలంక వంటి దేశాలు శిక్షణ శిబిరాలు ప్రారంభించాయి. ప్రస్తుతం విదేశాల్లో కొంత పరిస్థితి మెరుగ్గా ఉండడంతో ఈ ఏడాది ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ ఓ మీడియాతో మాట్లాడారు. సురక్షిత వాతావరణంలో ఐపీఎల్ నిర్వహించడం తమ ధ్యేయమని తెలిపారు. తమ తొలి ప్రాధాన్యం భారతదేశమని, కానీ పరిస్థితులు అనుకూలించకున్నా, ఈ ఏడాది క్రికెట్ క్యాలెండర్‌లో ఐపీఎల్‌కు మరో అవకాశం లేకపోతే విదేశాల్లో నిర్వహించేదానిపై ఆలోచిస్తాం అని పేర్కొన్నారు.
అయితే ఐపీఎల్ భారత్ లో కాకుండా విదేశాల్లో నిర్వహించడం ఇదేం కొత్త కాదని, గతంలో రెండుసార్లు నిర్వహించామని గుర్తుచేశారు. ఈ క్రీడా సంబరానికి శ్రీలంక, దక్షిణాఫ్రికా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అయితే కొన్ని రోజులుగా ఆ దేశాల్లో కూడా వైరస్ తీవ్ర రూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. విదేశాల్లో ఐపీఎల్ నిర్వహించడం ఒక ప్రతిపాదన మాత్రమేనని ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తమకు మాత్రం భారత్‌లో నిర్వహించాలనే ఉందని వెల్లడించారు.
ప్రస్తుతం ఐపీఎల్ నిర్వహణపై కూడా ఒక స్పష్టత లేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ పై ఇంకా ఎటు తేలలేదు. దీనిపై జూన్ 10వ తేదీన ఐసీసీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఐసీసీ నిర్ణయం ప్రకారం ఐపీఎల్‌పై ఓ క్లారిటీ రానుంది.