Begin typing your search above and press return to search.

అమిత్ మిశ్రాకు దెబ్బ పడనుందా?

By:  Tupaki Desk   |   21 Oct 2015 2:45 PM IST
అమిత్ మిశ్రాకు దెబ్బ పడనుందా?
X
టీమిండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా చిక్కుల్లో పడ్డారు. ఒక మహిళ చేసిన ఆరోపణ అతనికి పెద్ద సమస్యగా మారింది. గత నెలలో ఒక మహిళను తిట్టేసి.. దాడి చేశారన్న ఆరోపణలున్నాయి. దీనిపై బాధిత మహిళ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి అమిత్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇతడిని గురువారం జరిగే దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో ఆడించాలా? వద్దా? అన్న అంశంపై బీసీసీఐ దృష్టి సారించిందని చెబుతున్నారు.

పోలీసులు పంపిన నోటీసుల నేపథ్యంలోఈ ఘటనపై బీసీసీఐ విచారణకు ఆదేశించింది. దీంతో.. ఈ నివేదిక వచ్చే వరకూ అతడ్ని పక్కన పెడతారా? లేదంటే ఆడిస్తారా? అన్నది సందేహంగా మారింది. టీమిండియా.. దక్షిణాఫ్రికాల మధ్య సాగుతున్న గాంధీ.. మండేలా సిరీస్ లో భాగంగా గురువారం మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్ లో అమిత్ మిశ్రాకు ఛాన్స్ లభిస్తుందా? లేదా? అన్న అంశంపై మ్యాచ్ జరిగే సమయానికి నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. మరోవైపు.. వచ్చినవి ఆరోపణలు మాత్రమే కావటంతో.. తమ విచారణలో అమిత్ పాత్ర ఉందని తేలితేనే అతనిపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోందన్న వాదన వినిపిస్తోంది. గురువారం జరిగే మ్యాచ్ లో అమిత్ మిశ్రా ఆడతారా? లేదా? అన్న సస్పెన్స్ గురువారం వరకూ కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.