Begin typing your search above and press return to search.

ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్ .. ఇదే కారణం !

By:  Tupaki Desk   |   22 Aug 2020 5:00 AM IST
ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్ .. ఇదే కారణం !
X
ఐపీఎల్ .. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ .. సాధారణంగా వేసవిలో జరిగే ఈ లీగ్ , కరోనా కారణంగా .. నిరవధికంగా వాయిదా వేశారు. ఒకానొక సమయంలో ఈ ఏడాది ఇక ఐపీఎల్ లేనట్టే అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే బీసీసీఐ అద్యక్షడు దాదా చొరవతో యూఏఈ లో ఈ ఐపీఎల్ 2020 ని నిర్వహించబోతున్నారు. ఇప్పటికే మూడు జట్లు యూఏఈ కి చేరుకున్నాయి. ఈ తరుణంలో బీసీసీఐ ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ సీజన్ కోసం దుబాయ్ వెళ్తున్న క్రికెటర్లు కరోనా ప్రొటోకాల్స్ ఉల్లంఘించకుండా జాగ్రత్తగా ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి హెచ్చరించింది. ఎన్నోఆటంకాలను అధిగమించిన తర్వాత సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈ వేదికగా ఐపీఎల్ జరగనుంది.

ప్రస్తుతం యూఏఈలో కరోనా విజృంభణ పెరిగింది. దీంతో అప్రమత్తమైన బోర్డు.. ప్లేయర్లు, ఫ్రాంచైజీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎవరో ఒకరు చేసిన తప్పు వల్ల వేరేవాళ్లు ఇబ్బంది పడకూడదని మా భావన. అందుకే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఓనర్లు, ఫ్రాంచైజీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. కరోనా ప్రొటోకాల్స్ ను బ్రేక్ చేయవద్దని చెప్పాం. ఆటగాళ్ల భద్రతకు అవసరమైన అన్ని వసతులను యూఏఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కరోనా ముప్పు ఉండడంతో ఎక్కడపడితే అక్కడ తిరగవద్దంటూ అందరికీ హెచ్చరికలు పంపాం.'అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

ఐపీఎల్-2020 కోసం తొలి విడతగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ గురువారం యూఈఏలో అడుగు పెట్టాయి. ముందుగా రాయల్స్, పంజాబ్ దుబాయ్ చేరుకున్నాయి. మరో స్పెషల్ ఫ్లైట్లో కేకేఆర్ సాయంత్రం అబుదాబిలో అడుగుపెట్టింది. ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ శుక్రవారం మధ్యాహ్నం 12.45 కు దుబాయ్ బయల్దేరుతుందని ఆ టీమ్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా, యూఏఈ వెళ్లేముందే ప్లేయర్లకు పలుసార్లు కరోనా టెస్టులు చేశారు. అక్కడ అడుగు పెట్టిన తర్వాత ఆరో రోజుల ఐసోలేషన్లో మరో ఒక్కో రోజు గ్యాప్లో మూడు సార్లు టెస్టులు చేయించుకుంటారు. అన్నింటిలో నెగెటివ్ వస్తేనే బయో బబుల్లో ట్రెయినింగ్ కి అనుమతి ఇవ్వనున్నారు.