Begin typing your search above and press return to search.

ఐపీఎల్ నిర్వహణకు సిద్ధంగా ఉండండి: రాష్ర్టాలకు బీసీసీఐ లేఖ

By:  Tupaki Desk   |   11 Jun 2020 10:10 PM IST
ఐపీఎల్ నిర్వహణకు సిద్ధంగా ఉండండి: రాష్ర్టాలకు  బీసీసీఐ లేఖ
X
ప్రతి వేసవిలో సందడి చేసే క్రీడా ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ఈ ఏడాది నిర్వహించాల్సిన ఐపీఎల్ మహమ్మారి వైరస్ రాకతో వాయిదా పడింది. ఈ సమయంలో అక్టోబర్‌–నవంబర్‌లలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే దీని నిర్వహణకు ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ అడ్డంకిగా మారింది. టీ 20 వరల్డ్ కప్ వాయిదా పడితే ఐపీఎల్ నియ్వహణకు మార్గం సుగమం అవుతుంది. అయితే వరల్డ్ కప్ వాయిదాపై ఐసీసీ ఎటూ తేల్చడం లేదు. దీంతో బీసీసీఐ ఐసీసీని వదిలేసి ఐపీఎల్ నిర్వహణపై కసరత్తు మొదలుపెట్టింది.

ట్వంటీ 20 వరల్డ్ కప్ నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఎటూ తేల్చుకోలేకపోవడంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) నిర్వహణకు సంబంధించిన కసరత్తును భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) వేగవంతం చేసింది. టీ20 వరల్డ్‌కప్‌ జరగాల్సిన సమయంలోనే ఐపీఎల్‌ను జరిపితే ఎలా ఉంటుందనే ఆలోచన బీసీసీఐ చేస్తోంది. ఇందులో భాగంగా ఐపీఎల్‌ నిర్వహణపై బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఐపీఎల్‌ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని తమ అనుసంధాన క్రికెట్‌ అసోసియేషన్‌లను బీసీసీఐ సూచించింది. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రాష్ట్ర అసోసియేషన్‌లకు లేఖ రాశాడు. వైరస్‌ వ్యాప్తి తగ్గితే ఐపీఎల్‌ నిర్వహణపై అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామన్నామని, దాంతో అన్ని రాష్ట్ర క్రికెట్‌ బోర్డులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. అవసరమైతే ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్‌ను నిర్వహణను పరిశీలిద్దామని పేర్కొన్నాడు. అందుబాటులో ఉండే అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశాడు. కచ్చితంగా ఈ సీజన్‌ ఐపీఎల్‌ జరుగుతుందని గంగూలీ హా
భావిస్తున్నాడు. ఆటగాళ్లంతా ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ను ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.

అయితే ఐపీఎల్ లో భారత క్రికెటర్లే కాకుండా, విదేశీ ఆటగాళ్లు కూడా ఆడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఐపీఎల్‌ నిర‍్వహణపై సాధ్యమైనంత తొందర్లో నిర్ణయం తీసుకుంటామని గంగూలీ చెబుతున్నాడు.

ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ నిర్వహణకు సంబంధించి ఐసీసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వాయిదాలు వేస్తోంది. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన సమావేశంలో మరోసారి ఐసీసీ ఎటూ తేల్చలేకపోయింది. ప్రపంచకప్‌ విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు మరో నెల రోజుల పాటు వేచి చూడాలని నిర్ణయించింది. టి20 ప్రపంచకప్‌తో పాటు 2021లో మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లను షెడ్యూల్‌ ప్రకారం ఎలా నిర్వహించాలనే ప్రణాళికలతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించడం కూడా కొనసాగిస్తామని ఐసీసీ పేర్కొంది.

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితిని సమీక్షిస్తూనే ఆటగాళ్ల ఆరోగ్య భద్రత తదితర అంశాలపై కూడా దృష్టి పెట్టినట్లు ఐసీసీ చెప్పింది. టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా పడితే, ఐపీఎల్‌ సాధ్యపడుతుందనేది గంగూలీ భావిస్తున్నాడు.