Begin typing your search above and press return to search.

ఇండియా- పాక్‌ మ్యాచ్‌ జరగాల్సిందే..బీసీసీఐ క్లారిటీ !

By:  Tupaki Desk   |   19 Oct 2021 11:30 AM GMT
ఇండియా- పాక్‌ మ్యాచ్‌ జరగాల్సిందే..బీసీసీఐ క్లారిటీ !
X
ఇండియా,పాకిస్థాన్ మ్యాచ్ అనగానే అందరిలోనూ హైటెన్షన్ మెుదలవుతుంది. అనేక వివాదాలు, విమర్శలు వస్తునే ఉంటాయి. ఇండియా.. పాకిస్ధాన్‌ ను శతృదేశంగా భావిస్తుండడంతో ఆ దేశంతో జరిగే ఎలాంటి పరిణామైన కాస్త వివాదాస్పదాల దారి తీస్తుంది. తాజాగా టీ20 వరల్డ్ కప్ ఈవెంట్‌ లో ఈ నెల 24న పాక్,భారత్ మ్యాచ్ సందర్భంగా కూడా అనేక వివాదాలు ముందుకు వస్తున్నాయి. కశ్మీర్‌ లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో ఇండియా- పాకిస్తాన్‌ టీ20 మ్యాచ్‌ ను రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. పాక్ ప్రేరిపిత ముష్కరుల చర్యల కారణంగా కశ్మీర్‌లో ఆశాంతి నెలకొందని జాతీయవాదులు ఆరోపిస్తున్నారు.

మ్యాచ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో మ్యాచ్ జరుగుతుందా, లేదా అనే సందేహాం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఈ ఆంశంపై క్లారీటి ఇచ్చారు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా. కశ్మీర్‌లో ఉగ్ర చర్యలను ఖండిస్తూ.. ఐసీసీకి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేమని తెలిపారు. అంతర్జాతీయ టోర్నీలో అర్ధాతరంగా తప్పుకొవడం కుదరదన్నారు. నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం ఐసీసీ టోర్నీలో కచ్చితంగా ఆడాల్సిందేనని స్పష్టం చేశారు. కశ్మీర్‌ లో తాజా ఉగ్ర దాడుల నేపథ్యంలో భారత్‌- పాక్‌ మ్యాచ్‌‌ పై పునరాలోచించాలని కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌తో పాటు బిహార్‌ డిప్యూటీ సీఎం తార్‌కిషోర్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో మ్యాచ్‌ పై అభిమానుల్లో కాస్త టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో ట్విటర్‌లో #banpakcricket ట్రెండ్‌ అవుతోంది. మరోవైపు.. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబరు 24న జరిగే దాయాదుల పోరు కోసం క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఇక , ఐసీసీ మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌ లలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. గ్రూపు-ఏలో భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ ఏడు వికెట్ల తేడాతో విజయం నమోదవడం విశేషం. అంతేకాదు.. ఇరు మ్యాచ్‌ లలోనూ బౌలర్లే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ గా నిలిచారు.

టీ20 ప్రపంచకప్‌-2021 క్వాలిఫయర్స్‌ పోటీల్లో భాగంగా అక్టోబరు 18న ఐర్లాండ్‌- నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో ఐర్లాండ్‌ ప్రత్యర్థి జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 4 వికెట్లు పడగొట్టి నెదర్లాండ్స్‌ పతనాన్ని శాసించిన కర్టిస్‌ కాంపర్‌ కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. అంతేకాదు అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో 4 వరుస బంతుల్లో 4 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా కర్టిస్‌ ఘనత సాధించాడు. ఇక శ్రీలంక- నమీబియా మ్యాచ్‌ లోనూ.. దసున్‌ షనక సేన.. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు వికెట్లు పడగొట్టిన మహీశ్‌ తీక్షణ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గా నిలిచాడు. జోస్‌ బట్లర్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌.. కోహ్లి సేన చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌ లో ఓపెనింగ్‌ చేసిన కేఎల్‌ రాహుల్‌(52), ఇషాన్‌ కిషన్‌(70) అర్ధ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్‌ షమీ 3 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ ను దెబ్బకొట్టాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌- పాకిస్తాన్‌ మధ్య సోమవారం వార్మప్‌ మ్యాచ్‌ జరిగింది. ఇందులో బాబర్‌ ఆజం బృందం ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్‌ బాబర్‌ ఆజం అర్ధ సెంచరీ సాధించగా... ఫఖార్‌ జమాన్‌ మెరుగ్గా రాణించాడు