Begin typing your search above and press return to search.
కోల్ కతాలో కాళీ పూజకు వెళ్లిన క్రికెటర్.. ఇప్పుడు గన్ మెన్ ను పెట్టుకున్నాడు
By: Tupaki Desk | 19 Nov 2020 12:15 PM ISTబంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ కమ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కు ఇప్పుడో పెద్ద కష్టం వచ్చింది. ఇప్పుడు అతను బయటకు రావాలన్నా.. గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేయాలన్నా.. తన వెంట గన్ మెను ను ఉంచుకుంటున్నాడు. ఇదంతా అతగాడు.. కోల్ కతాలోని కాళీమాత పూజకు హాజరుకావటం వల్లనేనని చెబుతున్నారు. ఒక స్టార్ క్రికెటర్ తాను అనుసరిస్తున్న మతానికి సంబంధం లేని ప్రార్థనాలయానికి వెళ్లకూడదా? ఆ మాటకు వస్తే.. చాలామంది హిందూ ప్రముఖులు దర్గాలకు.. మసీదులకు.. చర్చిలకు ఎంచక్కా వెళ్లి వస్తారు కదా? అన్న సందేహం రాక మానదు.
మన దేశంలో ఉన్నంత సీన్ బంగ్లాదేశ్ లో లేదు. ఇస్తామిక్ మతాచారాన్ని అనుసరించే షకీబ్.. కోల్ కతాలోని కాళీమాత ఆలయానికి వెళ్లటం.. అమ్మవారి పూజలో పాల్గొన్నతీరుపై బంగ్లాదేశ్ లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో అతడు చేసిన పని ఆ దేశంలోని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పలువురు అతడ్ని తీవ్రంగా తప్పు పట్టటంతో పాటు.. వార్నింగ్ లు ఇస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో షకీబ్ భద్రత మీద బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదురి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షకీబ్ కు అవసరమైన భద్రతను కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు.ఈ నేపథ్యంలోనే అతడికి ఒక గన్ మెన్ ను ఏర్పాటు చేశారు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడుకూడా.. సదరు గన్ మెన్ పక్కనే ఉంటూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పిన షకీబ్.. వివాదాన్ని సర్దుబాటుచేసే ప్రయత్నంచేసినా.. పలువురు మాత్రం ఆగ్రహావేశాల్ని ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు.