Begin typing your search above and press return to search.

కోర్టుకెక్కి 'సంగ్రామం'.. ఏం తేలుతుంది?

By:  Tupaki Desk   |   24 Aug 2022 1:30 PM GMT
కోర్టుకెక్కి సంగ్రామం..  ఏం తేలుతుంది?
X
బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేస్తున్న సంగ్రామ పాద‌యాత్ర తాజాగా హైకోర్టు మెట్టెక్కిం ది. పాదయాత్రను ఆపకుండా పోలీసులను ఆదేశించాలని పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. పోలీసుల ఆదేశాలను సవాల్ చేస్తూ బీజేపీ తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి.. హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. పిటిషన్పై ఈ మధ్యాహ్నం విచార‌ణ చేపట్టేందుకు హైకోర్టు అంగీకరిం చింది. దీంతో ఇప్పుడు సంగ్రామ యాత్ర ఎలాంటి మ‌లుపు తీసుకుంటుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

ఏం జ‌రిగింది? బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలని ఆదేశిస్తూ వరంగల్ కమిషనరేట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌ని.. యువ‌త‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని.. దీనివ‌ల్ల అల్ల‌ర్లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని..

కొన్ని కొన్ని సార్లు ఇవి మ‌త ఘ‌ర్స‌ణ‌ల‌కు దారితీసినా ఆశ్చ‌ర్యం లేద‌ని.. పోలీసులు త‌మ నోటీ సులో పేర్కొంటూ.. సంగ్రామ యాత్ర‌కు బ్రేకులు వేశారు. దీంతో బీజేపీ కోర్టును ఆశ్ర‌యించింది. పోలీసుల ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ లో బీజేపీ పేర్కొంది.

ప్రభుత్వ, రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు యాత్రను ఆపేందుకు నోటీసులు ఇచ్చారని పిటిషన్లో ఆరోపిం చారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు రాజకీయ పార్టీలు పాదయాత్రలు చేయడం దేశంలో అత్యంత సాధారణమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు విపక్షాల నిర్మాణాత్మక విమర్శలను స్వీకరించాలన్నారు. కానీ ప్రభుత్వ ప్రోత్బలంతో పోలీసులు పాదయాత్ర ఆపివేయడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు డీజీపీ మౌఖికంగా అనుమతిచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. యాత్రకు ఇప్పటివరకు పోలీసులు యాత్రకు భద్రత కల్పించడంతో పాటు అన్ని విధాల సహకరించడ మే అనుమతి ఉందనడానికి నిదర్శనం అని పేర్కొన్నారు.

రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని నోటీసులో పోలీసులు పేర్కొనడం నిరాదారమన్నారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా రెచ్చగొట్టారో పోలీసులు స్పష్టం చేయడం లేదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఊహాజనితంగా పేర్కొనడం సమంజసం కాదన్నారు.