Begin typing your search above and press return to search.

హోటల్ గదిలోనూ కిట్ ధరించి బ్యాటింగ్ ..వీడియో వైరల్

By:  Tupaki Desk   |   7 Jan 2021 9:48 AM GMT
హోటల్ గదిలోనూ కిట్ ధరించి  బ్యాటింగ్ ..వీడియో వైరల్
X
స్టీవ్ స్మిత్..ఆస్ట్రేలియా స్టార్ బాట్స్ మెన్ వరుసగా దిగ్గజ ఆటగాళ్ళు టీం నుంచి వెళ్ళిపోయినా ఆ లోటు తెలియకుండా రాణిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ప్రస్తుత తరంలో టెస్ట్ క్రికెట్ లో టాప్ బాట్స్ మెన్ గా నిలిచాడు. ఆస్ట్రేలియాకు విజయాలు అందించడానికి స్మిత్ ఎప్పుడూ దూకుడు గానే వ్యవహరిస్తాడు. అతడిది ఓటమిని అంగీకరించే స్వభావం కాదు. ఎలాగైనా జట్టుకు విజయాన్ని ఇవ్వాలనే పట్టుదలతో ఆడుతుంటాడు.

అలా జట్టుకు ఎలాగైనా గెలుపు ఇవ్వాలనే పక్కదారి పట్టి బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడి నిషేధానికి గురై ఏడాది పాటు జట్టుకు దూరం అయ్యాడు. తిరిగి జట్టులోకి వచ్చాక తనేంటో నిరూపించుకున్నాడు. జట్టు విజయాల్లో కీలకంగా మారాడు. ఓ దశలో విరాట్ కోహ్లిని అధిగమించి ఐసీసీ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా నిలిచాడు. ప్రస్తుతం టాప్ త్రీ ర్యాంక్ లో ఉన్నాడు. తాజాగా క్రికెట్ అంటే స్మిత్ కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో తెలియజేసే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్మిత్ భార్య డేనీ విలిస్ ఓ వీడియో షేర్ చేయగా అందులో స్మిత్ క్రికెట్ పై చూపుతున్న ప్రేమ, అంకిత భావం చూసి అతడిని ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. డేనీ షేర్ చేసిన వీడియోలో స్మిత్ హోటల్ గదిలో క్రికెట్ కిట్ ధరించి బ్యాటింగ్ చేస్తున్నాడు. స్మిత్ కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. గదిలో ఉన్నా కూడా స్మిత్ కిట్ ధరించి బ్యాటింగ్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఆసక్తికరమైన వీడియోని షేర్ చేసిన డేనీ ' క్రిస్మస్ సాయంత్రం వేళ ఒక పిల్లాడి మాదిరిగా' అని కామెంట్ పెట్టారు. అలాగే షెండ్ చేసిన వీడియో కింద 'అప్పుడప్పుడు ఆత్మ తృప్తి కోసం పూర్తిస్థాయిలో కిట్ ధరించి షాడో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది' అని కామెంట్ చేసింది. డేనీ చేసిన పోస్టులు ప్రస్తుతం వైరల్ గా మారాయి. క్రికెట్ ని ఎంతో ఇష్టపడే స్మిత్ ని అభిమానులు అభినందిస్తున్నారు.