Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాట ఆయ‌న‌కే రివ‌ర్స్ అయింది

By:  Tupaki Desk   |   3 Jan 2016 9:35 AM GMT
కేసీఆర్ మాట ఆయ‌న‌కే రివ‌ర్స్ అయింది
X
బాధ్య‌త గ‌ల ప‌ద‌వుల్లో ఉన్న నాయ‌కులు ఎపుడైనా త‌మ నోటిని అదుపులో ఉంచుకోవాల్సిందే. కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సాహ‌ప‌రిచేందుకో..క్రేజీగా ఉంటాయ‌నో విమ‌ర్శ‌లు చేస్తే చివ‌రికి మిగిలేది ఆ ఝ‌ల‌క్ త‌మ‌కే త‌గ‌ల‌డం త‌ప్ప మ‌రేం కాదు. తాజాగా ఈ ప‌రిస్థితి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు ఎదురైంది.

తెలంగాణ వాలే జాగో.. ఆంధ్రావాలాకో బాగో-టీఆర్ ఎస్ పార్టీ ఇచ్చిన నినాదాల్లో బాగా పాపుల‌ర్ అయిన ఇదొక్క‌టి. ఈ నినాదం వల్ల నగరంలో త‌మ‌కు భద్రత కరువైందని అనేక వ‌ర్గాలు ఆవేద‌న‌ వ్యక్తం చేసినా కేసీఆర్ ఆవిధంగానే ముంద‌కు వెళ్లారు. తాజాగా కేసీఆర్ ఇచ్చిన స్టేట్‌ మెంట్‌ ను ఆయ‌న‌కే గుర్తు చేస్తూ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ రివ‌ర్స్ పంచ్ వేసింది. విభిన్న సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్‌ నగరంలో జాగో...బాగో అని చెప్పిన మార్చి ముఖ్య‌మంత్రి కే చంద్రశేఖరరావును భగావో...హైదరాబాద్‌ బచావో అని టీపీసీసీ త‌ర‌ఫున‌ పిలుపునిచ్చింది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ అభివృద్ధికి గ‌తంలో కేసీఆర్‌ ఇచ్చిన నినాదం ఆటంకంగా మారిందని పేర్కొంది.

లౌకికభావాలను, ప్రజల మధ్య ఉన్న సౌభ్రాతృత్వ జీవనాన్ని ఎంఐఎం, బీజేపీ పార్టీలు దెబ్బతిస్తున్నాయని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మండిప‌డ్డారు. టీఆర్ ఎస్ ఆ రెండు పార్టీల‌కు ఆజ్యం పోస్తోంద‌ని విమర్శించారు. కెేసీఆర్‌ కుటుంబం మాఫియా చర్యలతో గ్రేటర్‌ హైదరాబాద్‌ వణికిపోతుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ నిర్మాణాల పేరుతో ఇళ్ల‌ను కూల్చివేయడంతో మరింత మందిలో త‌మ‌కూ అదే ప‌రిస్థితి ఎదురవుతుందనే ఆందోళన నెలకొందన్నారు. మెట్రో అలైన్‌ మెంట్‌ మార్పుల విషయంలోనూ టీఆర్‌ ఎస్‌ రెండు నాలుకల ధోరణి అవలంభిస్తుందని విమర్శించారు. గోదావరి జలాలకు సంబంధించిన పనులు కాంగ్రెస్‌ హయంలోనే ప్రారంభమైతే టీఆర్‌ ఎస్‌ నేతలు పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హోర్డింగులతో ఓట్లు రాలవని ఆయన స్పష్టం చేశారు.

కేసీఆర్ చెప్పిన‌ మాట‌ల‌తోనే ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళతామ‌ని చెప్పిన భ‌ట్టి జోరును చూస్తుంటే....కేసీఆర్‌ త‌న‌కు తానే శ‌త్రువు అయిన‌ట్లయింద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.