Begin typing your search above and press return to search.

ఒబాబా.. అర్జెంటీనా డ్యాన్సర్ తో కలిసి...?

By:  Tupaki Desk   |   24 March 2016 9:28 AM GMT
ఒబాబా.. అర్జెంటీనా డ్యాన్సర్ తో కలిసి...?
X
అమెరికా అధ్యక్షుడంటే ఏంటో అనుకుంటాం కానీ.. మన ముఖ్యమంత్రులు, మన ప్రధాన మంత్రులు చేయలేని ఎన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసేస్తుంటారు ఆ పదవిలో ఉన్నవాళ్లు. కొన్నిసార్లు అందరిలో ఒకరిలా అమెరికన్ ప్రెసిడెంట్స్ చేసే పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఈ విషయంలో బరాక్ ఒబామా స్టయిలే వేరు. చాలా సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన ఒబామా.. ఎన్నోసార్లు సామాన్యుడిలాగే ప్రవర్తించారు. తాజాగా ఆయన అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో పర్యటన సందర్భంగా జరిగిన ఓ డిన్నర్ పార్టీలో ఓ అర్జెంటీనా డ్యాన్సర్ తో కలిసి డ్యాన్స్ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

డిన్నర్లో భాగంగా డ్యాన్సర్లతో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయగా.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ అమెరికన్ అధ్యక్షుడు డ్యాన్స్ చేయడానికి తయారయ్యాడు. అర్జెంటీనా డ్యాన్సర్ తో కలిసి ఆయన డ్యాన్స్ చేశారు. ట్యాంగో మ్యూజిక్ కు అనుగుణంగా స్టెప్పులేశారు. సెక్సీ లుక్ లో ఉన్న అమ్మాయిని అల్లుకుపోతూ ఒబామా చేసిన డ్యాన్స్ హాట్ టాపిక్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డిన్నర్ లో ఒబామా భార్య మిషెల్లీ కూడా ఉంది. ముందు డ్యాన్సర్ తనతో కలిసి స్టెప్పులేయడానికి పిలిస్తే.. ఒబామా మొహమాట పడ్డారు. తర్వాత ఆయనే ముందుకొచ్చి డ్యాన్స్ చేశారు. మరోవైపు మిషెల్లీ వేరే వ్యక్తితో కలిసి డ్యాన్స్ చేయడం విశేషం.