Begin typing your search above and press return to search.

ఒబామా ఎంజాయ్ చూస్తే దిమ్మ తిర‌గాల్సిందే

By:  Tupaki Desk   |   3 Feb 2017 4:52 PM GMT
ఒబామా ఎంజాయ్ చూస్తే దిమ్మ తిర‌గాల్సిందే
X
అగ్ర‌రాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు బ‌రాక్ ఒబామా అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌కు టాటా చెప్పి వైట్‌ హౌజ్‌ కు గుడ్‌ బై చెప్పినప్ప‌టి నుంచి హాలీడే ఎంజాయ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. బిజినెస్ టైకూన్ రిచ‌ర్డ్ బ్రాన్స‌న్‌ తో క‌లిసి ఒబామా దంప‌తులు వెకేష‌న్‌ కు వెళ్లారు. ఇలా విలాసవంతంగా, జాలీగా గ‌డుపుతున్న స‌మ‌యం తాలుకు వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అందులోనూ ఇది ఒబామా దంప‌తులు ఇద్ద‌రూ ఉన్న వీడియో కావ‌డంతో క్రేజ్ తారాస్థాయికి చేరింది.

రెగ్యుల‌ర్ టీష‌ర్ట్‌ - షార్ట్స్‌ - స్లిప్ప‌ర్స్ వేసుకొని సింపుల్‌ గా బీచ్‌ లో వెళ్తున్న మిషెల్‌ తో క‌లిసి వెళ్తున్న ఒబామా వీడియో ఇంట్రెస్టింట్ గా ఉంది. అంతేకాకుండా...ఈ వీడియోలో ఒబామా క్యాప్‌ ను రివ‌ర్స్‌ లో పెట్టుకొని క‌నిపించ‌డం నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. ఈ నెల ఒక‌టిన ఈ వీడియో ట్విట్ట‌ర్‌ లో షేర్ చేయ‌గా.. ఇప్ప‌టికే 1.5 ల‌క్ష‌ల లైక్స్‌ - 78 వేల‌కు పైగా రీట్వీట్స్ రావ‌డం విశేషం. ఈ వీడియోలో ఒబామాను చూస్తే.. ఎనిమిదేళ్లు అగ్ర‌రాజ్యాన్ని ఏలిన నేత ఈయ‌నేనా అన్న అనుమానం క‌ల‌గ‌క మాన‌దు. దీనిపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు. కంద‌రు ఇదే ఉత్సాహంతో అమెరికాను రాక్ స్టార్ లాగా ముందుకు తీసుకుపోయార‌ని ప్ర‌శంసిస్తుండ‌గా..ఇంకొంద‌రు వ‌య‌సు పైబ‌డిన కొద్దీ ఉత్సాహం పెరుగుతోంద‌ని ట్వీట్ చేశారు. ఇంకొంద‌రు మాత్రం ఇప్ప‌టికీ ఒబామాకు విహార యాత్ర‌కు వెళ్లే స‌మ‌యం దొరికిన‌ట్లుంద‌ని సెటైర్ వేశారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/