Begin typing your search above and press return to search.

కరెన్సీ నోట్ల రద్దు ముందుగా ఎవరెవరి తెలుసు?

By:  Tupaki Desk   |   9 Nov 2016 4:30 AM GMT
కరెన్సీ నోట్ల రద్దు ముందుగా ఎవరెవరి తెలుసు?
X
500 - 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి ప్రకటించిన అనంతరం ఒక్కసారిగా భారతదేశం అంతా అలజడికి లోనైంంది. దేశంలో దాదాపు అందరికీ ఆ విషయం అప్పుడే తెలిసిందా? కేవలం పదిమందిలోపు వ్యక్తులకే ఈ విషయం తెలిసిందా? ఎంతమందికి ఈ విషయం ముందుగా తెలిసింది? అనే ప్రశ్నలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే... ఈ విషయం ముందుగా తెలిస్తే చాలా మంది చాలా జాగ్రత్తలు తీసుకుని ఉండేవారు. ముఖ్యంగా నల్లబాబులు అత్యంత వేగంగా నోటును వేరే రూపంలోకి మార్చేసుకుని ఉండేవారు. అయితే ఈ విషయంలో చిన్న లీక్ కూడా రాకుండా ఆర్బీఐ ఎంతో జాగ్రత్తపడిందనే చెప్పాలి. ఈ విషయాలపై తాజాగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పాత నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్పందించిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్... ఆశ్చర్యకరమైన ఈ నిర్ణయం గురించి ప్రధానమంత్రి - ఆర్థిక మంత్రి - ఆర్బీఐలోని అతికొద్ది మంది ముఖ్యులకు మాత్రమే తెలుసునని అన్నారు. ఆ అతికొద్ది మందికి తప్ప కనీసం ప్రభుత్వ పెద్దలకు కూడా ఈ విషయం గురించి ఏమీ తెలియదని - నోట్ల రద్దు నిర్ణయాన్ని పకడ్బందీగా వెల్లడించాలనే ఉద్దేశంతోనే సమాచారాన్ని గోప్యంగా ఉంచామని అన్నారు. ఇదే సమయంలో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని రాష్ట్రాలకూ హెల్ప్ లైన్స్ ఏర్పాటుచేశామని, సామాన్యులకు ఇబ్బంది కలుగకుండా ప్రక్రియను పూర్తిచేస్తామని తెలిపారు. అలాగే.. బ్యాంకులు పోస్ట్ ఆఫీసుల ద్వారా పాత నోట్లను సేకరిస్తామన్న ఆర్థిక శాఖ కార్యదర్శి... ఆమేరకు అవసరమైన ఏర్పాట్లపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేస్తామన్నారు.

ఇదే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన కొద్ది సేపటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) - కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఢిల్లీలో కీలక మీడియా సమావేశం నిర్వహించారు. అవినీతిని రూపుమాపడమే కాక ఆర్థిక స్వావలంబన సాధించేందుకే పాత నోట్లు రద్దుచేసి - కొత్తవాటిని తీసుకొస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ చెప్పారు. నవంబర్ 10 (గురువారం) నుంచి కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ వర్గాలు తీవ్రంగా కష్టపడుతున్నాయని - క్షణం తీరిక లేకుండా నోట్లను ముద్రిస్తున్నామని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/