Begin typing your search above and press return to search.

వెబ్‌ సిరీస్ చూసి దొంగతనం ప్లాన్‌ చేశాడు, చివరికి..!

By:  Tupaki Desk   |   9 Oct 2022 12:30 AM GMT
వెబ్‌ సిరీస్ చూసి దొంగతనం ప్లాన్‌ చేశాడు, చివరికి..!
X
సినిమాల వల్ల ఎంతటి ప్రయోజనం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో విషయాలు సినిమాలను చూసి నేర్చుకోవచ్చు. భాష మొదలుకుని ఎన్నో విషయాలను సినిమాల ద్వారా నేర్చుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. అయితే అదే సినిమాలను కొందరు నేరాలను చేసేందుకు ఇన్సిపిరేషన్ గా తీసుకుంటున్నారు.

తాజాగా ఇంగ్లీష్‌ సూపర్ హిట్‌ వెబ్‌ సిరీస్‌ మనీ హేస్ట్‌ వెబ్‌ సిరీస్‌ ను చూసి ఒక బ్యాంక్ మేనేజర్ ఏకంగా 34 కోట్ల రూపాయలను కొట్టేసేందుకు ప్రయత్నించాడు. అయితే అతడి దురదృష్టమో లేదా బ్యాంక్ లో డిపాజిట్ చేసిన ఖాతాదారుల అదృష్టమో కానీ అతడి దొంగతనం బయట పడింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... మహారాష్ట్రకు చెందిన అల్తాఫ్‌ అనే వ్యక్తి ఐసీఐసీఐ బ్యాంక్ లో మేనేజర్‌ గా పని చేస్తున్నాడు. ఆయనకు ఎన్నాళ్లు ఈ అరకొర జీవితం అనిపించిందో ఏమో కానీ దొంగతనం చేయాలి అనిపించిందట. మనీ హేస్ట్‌ వెబ్‌ సిరీస్ చూసిన తర్వాత ఆ కోరిక మరింతగా పెరిగి దొంగతనం చేసేందుకు ప్లాన్‌ చేశాడు. ఆ వెబ్‌ సిరీస్‌ లో మాదిరిగానే డబ్బులు కాజేయాలని నిర్ణయించుకున్నాడు.

ముందుగా అనుకున్న పథకం ప్రకారం లాకర్‌ రూమ్‌ నుండి భవనం వెనుక వైపున ఉన్న ఏసీ డక్ హోల్‌ ద్వారా డబ్బు లను విసిరి వేశాడు. అప్పటికే అక్కడ కాచుకుని కూర్చుని ఉన్న వ్యక్తి ఆ డబ్బును అక్కడ నుండి తీసుకుని ఉడాయించాడు. ఆ వెంటనే సీసీ కెమెరా యొక్క వీడియో ఫుటేజ్ ను ఎరైజ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడట.

పోలీసులు అన్ని విధాలుగా ఎంక్వౌరీ చేసిన తర్వాత మేనేజర్‌ అల్తాఫ్ యొక్క ప్రవర్తనపై అనుమానం రావడంతో అటు నుండి కేసును నరుక్కుంటూ వచ్చారు. తీగ లాగితే డొంక కదిలినట్లుగా అతడి యొక్క దొంగతనం బయట పడింది. తాను మనీ హేస్ట్‌ వెబ్‌ సిరీస్‌ ను చూసి ఈ దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.