Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ లో ఒక బ్యాంక్ కు ఫైన్ వేశారు..ఎందుకో తెలుసా?

By:  Tupaki Desk   |   13 Jun 2019 6:34 AM GMT
హైద‌రాబాద్ లో ఒక బ్యాంక్ కు ఫైన్ వేశారు..ఎందుకో తెలుసా?
X
ఐస్ క్రీం తిన్నాం.. దాని రేప‌ర్ ను డ‌స్ట్ బిన్ లో కాకుండా.. రోడ్డు మీద ప‌డేయ‌టం మామూలే. ఇంట్లో చెత్త‌ను తీసుకొచ్చి బ‌య‌ట ప‌డేసే విష‌యంలో చాలామందికి ప‌ట్టింపులు పెద్ద‌గా ఉండ‌వు. అంత‌దాకా ఎందుకు డ్రైనేజీ బ‌య‌ట‌కు పొంగుతున్నా.. ఇబ్బంది ప‌డుతూ రోడ్డు ప‌క్క‌గా న‌డిచే అల‌వాటు ఉన్న హైద‌రాబాదీయులు.. ప‌రిస‌రాల్ని శుభ్రంగా ఉంచాల‌న్న విష‌యంలో పెద్దగా ప‌ట్టించుకోర‌న్న విష‌యం తెలిసిందే.

హైద‌రాబాద్ లోని చాలామంది మాదిరే.. హైద‌రాబాద్‌ కు చెందిన ఒక బ్యాంక్ కూడా వ్య‌వ‌హ‌రించింది. త‌న బ్యాంకులోని చెత్త‌ను రోడ్డు మీద ప‌డింది. అయితే.. అంద‌రిని వ‌దిలిపెట్టిన‌ట్లుగా జీహెచ్ ఎంసీ సిబ్బంది లైట్ తీసుకోలేదు. ఆ బ్యాంకుకు భారీగా ఫైన్ వేసిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. హైద‌రాబాద్ లోని సోమాజిగూడలో ఉన్న కోట‌క్ మ‌హీంద్రా బ్యాంకుకు గ్రేట‌ర్ సిబ్బంది స‌రికొత్త‌గా షాకిచ్చారు.

బ్యాంకులోని వేస్ట్ పేప‌ర్లు.. ప‌నికి రాని కాగితాలు.. త‌దిత‌ర చెత్త‌ను బ్యాంకు ముందున్న పుట్ పాత్ మీద వేశారు. ఈ విష‌యాన్ని కొంద‌రు జీహెచ్ ఎంసీ సీనియ‌ర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అంతే.. రంగంలోకి దిగిన వారు స‌ద‌రు బ్యాంక్ కు రూ.20వేల మొత్తాన్ని జ‌రిమానా విధిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. చెత్త‌ను చెత్త కుండీలోనే వేయాల‌ని.. ఇష్టానుసారంగా రోడ్ల మీద వేయ‌టం బాధ్య‌తారాహిత్యం కింద‌కు వ‌స్తుందంటూ క్లాస్ పీకి మ‌రీ ఫైన్ వేశారు. ఇదే తీరులో జీహెచ్ఎంసీ సిబ్బంది దృష్టి సారిస్తే.. రోడ్డు మీద చెత్త‌తో పాటు.. సంస్థ‌కు ఆదాయం కూడా బాగా వ‌చ్చే అవ‌కాశం ఉంది.