Begin typing your search above and press return to search.

బాబు వరమిచ్చినా బ్యాంకు వాళ్లు పడనివ్వడం లేదు

By:  Tupaki Desk   |   4 April 2019 1:33 PM GMT
బాబు వరమిచ్చినా బ్యాంకు వాళ్లు పడనివ్వడం లేదు
X
దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యటం లేదు అనేది సామెత. ప్రస్తుతం ఈ సామెత చంద్రబాబు ప్రభుత్వానికి పర్‌ ఫెక్ట్‌ గా సూట్‌ అవుతుంది. ఎన్నికల టైమ్‌లో వివిద ప్రభుత్వ పథకాలు సొమ్ములన్నీ బ్యాంకులో పడేలా సెట్‌ చేశారు చంద్రబాబునాయుడు. అసలు ఆ డబ్బులన్నీ అర్హులైన వారి ఎక్కౌంట్స్‌ లో పడితే.. తమ విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు చంద్రబాబు. కానీ ఆయనకు బ్యాంకువాళ్లు బాగా దెబ్బేసేట్టే కన్పిస్తున్నారు.

పేదలకైనా - ఓటర్లకైనా.. అంతెందుకు ఎవ్వరికైనా.. డబ్బు అనేది చేతిలో ఉంటేనే ఉన్నట్లు. బ్యాంకులో ఎన్ని డబ్బులున్నా చేతిలో లేకపోతే ఆ మజా ఉండదు. అందుక ఎన్నికల్లో అభ్యర్థులందరూ డబ్బులు పంచేది. దీన్ని దృష్టి పెట్టుకున్నచంద్రబాబు సరిగ్గా ఎన్నికల తేది ముందు పసుపు కుంకుమ పథకం డబ్బులు మహిళల అక్కౌంట్‌ లో పడేలా సెట్‌ చేశారు. గతంలోనే చెక్‌ లు ఇచ్చారు. అవి ఏప్రిల్‌ 5న బ్యాంకులో వేసుకోవాలి అనేలా ఉత్తర్వులు ఇచ్చారు. కట్‌ చేస్తే ఏప్రిల్‌ 5 బాబూ జగ్జీజీవన్‌ రామ్‌ జయంతి. ఆ తర్వాత ఏప్రిల్‌ 6 ఉగాది. తర్వాతి రోజు ఆదివారం. అంటే.. వరుసగా మూడు రోజులు సెలవు. అంటే ఈ మూడు రోజుల్లో బ్యాంకులో చెక్‌ లు వేయడం కుదరదు. అంటే సోమవారం బ్యాంకుకు వెళ్లి చెక్‌ వేసుకోవాలి. ప్రభుత్వ చెక్కులు కాబట్టి ఒకటి - రెండు రోజుల్లో డబ్బులు ఖాతాల్లో పడే అవకాశంఉండదు. చెక్కులు చెల్లి డబ్బులు రావడానికికచ్చితంగా మూడు - నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంటుంది. 11వ తేదీన ఎన్నికలు ఉన్నందున మళ్లీ సెలవు ఉంటుంది. దీంతోఎన్నికల తర్వాతే ఈ విడత పసుపు – కుంకుమ డబ్బులు డ్వాక్రా మహిళలకు అందే అవకాశం ఉంది. అయితే ఎన్నికల ముందే డబ్బు మహిళల చేతికందుతుందని - దీంతో వారంతా తమకే ఓటేస్తారని టీడీపీ పెట్టుకున్న ఆశలపై వరస సెలవులు నీళ్లు చల్లేట్లే కన్పిస్తుంది. పాపం చంద్రబాబు వరమిచ్చినా.. బ్యాంకు వాళ్లు మాత్రం అక్కౌంట్‌ లో డబ్బులు పడనివ్వడం లేదు.